Daaku Maharaaj Review In Telugu: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'డాకు మహారాజ్'. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఏపీలో బెనిఫిట్ షోలు మొదలు అయ్యాయి. మరి సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉందో తెలుసా? ఆడియన్స్ ఏమంటున్నారో చూడండి. 

Continues below advertisement


హిట్ అంటోన్న అమెరికా జనాలు!
అమెరికా నుంచి 'డాకు మహారాజ్'కు సూపర్ హిట్ టాక్ లభించింది. టెక్నికల్ అంశాల పరంగా సినిమా చాలా బాగుందని అక్కడి జనాలు చెబుతున్నారు. బాలయ్య, తమన్ కలిసి మరొకసారి సాలిడ్ మాస్ మసాలా మూమెంట్స్ ఆడియన్స్ కోసం ఇచ్చారని అంటున్నారు. కమర్షియల్ అంశాలతో కూడిన కథతో బాలకృష్ణను దర్శకుడు బాబీ చాలా బాగా చూపించారని తెలిపారు. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా చాలా ప్రిడిక్టబుల్ (ఆడియన్స్ అందరూ ఊహించే విధం)గా ఉందట. చివరి 30 నిమిషాలు డ్రాగ్ చేశారని టాక్‌. కమర్షియల్ సినిమా ఎక్స్పీరియన్స్ కోసం సినిమాకు వెళ్లొచ్చు అంటున్నారు.


Also Read‘డాకు మహారాజ్’ దర్శకుడు బాబీ కొల్లి ఇంటర్వ్యూ... చిరంజీవి, బాలకృష్ణ‌లో ఆయన గమనించిన పోలికలు ఇవేనట...  థియేటర్లు దద్దరిల్లడం గ్యారెంటీ అంటున్నాడు






యాక్షన్ సినిమా... స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్!
సోషల్ మీడియాలో మెజారిటీ జనాల నుంచి 'డాకు‌ మహారాజ్' గురించి వినిపించే మాట ఒక్కటే... స్టైలిష్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని! విజువల్స్ పరంగా సినిమా చాలా బాగుందట. అభిమానులతో పాటు ఆడియన్స్ అందరికీ హై ఇచ్చే యాక్షన్ సీక్రెన్సులు ఆరేడు వరకు ఉన్నాయట. రెండు క్యారెక్టర్ లో బాలకృష్ణ బాగా చేశారని, ఫస్టాఫ్ థ్రిల్లింగ్ యాక్షన్ అండ్ డ్రామా మూమెంట్స్ ఉన్నాయని టాక్. 







ఫస్టాఫ్ బావుంది... సెకండాఫ్ డీసెంట్!
ఇంటర్వెల్ ముందు తర్వాత అని చెప్పాల్సి వస్తే... 'డాకు మహారాజ్' ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని ఆడియన్స్ అంటున్నారు. ఇక సెకండాఫ్ డీసెంట్ అట. అభిమానులు అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. మరొకవైపు సోషల్ మీడియాలో కొంతమంది నుంచి నెగిటివ్ టాక్ కూడా ఉంది. సినిమా మిక్స్డ్ రివ్యూస్ అందుకుంటోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. 'డాకు మహారాజ్' మీద వచ్చిన ట్వీట్స్ కొన్ని చూడండి.


Also Read: బాలకృష్ణ 'డాకు మహారాజ్' రివ్యూ లైవ్ అప్డేట్స్ - సీన్ టు సీన్ ఏం జరుగుతుందో మీ ముందుకు