గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా అంటే మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్ (Music Director Thaman) పూనకం వచ్చినట్టు కొడతారు. వాళ్ళిద్దరిది సూపర్ డూపర్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు కొత్తగా విడుదలైన పాట విన్నా కూడా ఆ మాటే అంటారు. 


డాకు మహారాజ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'డాకు మహారాజ్' (Daaku Maharaaj). ఇందులో తొలి పాట 'ది రేజ్ ఆఫ్ డాకు'ను ఇవాళ విడుదల చేశారు. 


'డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా...
ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా'అంటూ సాగిన 'ది రేజ్ ఆఫ్ డాకు'ను అనంత శ్రీరామ్ రాశారు. హీరో డాకు మహారాజ్ క్యారెక్టరైజేషన్ తెలియజేసేలా ఈ పాటను రాశారు.



'ది రేజ్ ఆఫ్ డాకు' పాటను భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి ఆలపించారు. అందరి గొంతుల్లో హీరో క్యారెక్టర్ తాలూకా పవర్ కనిపించింది. ఈ పాటలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా ఉన్నారు. లిరికల్ వీడియోలో ఆమె కూడా కనిపించారు. 'అఖండ' విజయం తర్వాత బాలకృష్ణతో కలిసి ఆమె నటిస్తున్న చిత్రమిది. దీని తర్వాత 'అఖండ 2 తాండవం'లో కూడా ఆమె సందడి చేయనున్నారు.


Also Readఅల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?






కొత్త లుక్కులో కనువిందు చేసిన బాలయ్య
బాలకృష్ణ సినిమా అంటే సేమ్ లుక్ అని, ఆ విషయంలో ఎటువంటి అంచనాలు పెట్టుకోకూడదని నందమూరి ఫ్యాన్స్ కొన్ని రోజుల క్రితం వరకు అనుకునేవారు. కానీ, ఈ మధ్య బాలయ్య స్టైల్ మార్చారు. ప్రతి సినిమాకూ కొత్త లుక్ చూపిస్తూ తన అభిమానులను మాత్రమే కాదు... అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. 'డాకు మహారాజ్'లో అయితే ఇప్పటి వరకు కనిపించనటువంటి కొత్త లుక్కులో కనిపించారు.


Also Read: అన్న కొడుకు పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిన రాజమౌళి - వీడియో వైరల్


Daaku Maharaj Cast And Crew: బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న 'డాకు మహారాజ్' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా వర్క్: విజయ్ కార్తీక్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎడిటర్: నిరంజన్ దేవరమానే, మ్యూజిక్: తమన్.