News Gone Viral On Priyanka Chopra Role In SSMB 29 Movie: దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) .. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ ప్రాజెక్టుల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్‌తో చేపడుతోన్న ఈ ప్రాజెక్టును హాలీవుడ్ రేంజ్‌లో జక్కన్న తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పలు అప్ డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్ న్యూ లుక్‌లో కనిపించనున్నారు. కొన్నాళ్లుగా ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు సూపర్ స్టార్.


ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజిబెత్ ఇస్లాన్ కథానాయికగా నటిస్తారన్న ప్రచారం సాగింది. ఆ తర్వాత గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. అయితే, మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఈ సినిమాలో నటీనటుల గురించి ఎలాంటి లీకులు కాలేదు. ఇటీవలే మహేశ్ బాబు (Mahesh babu) పాస్ పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు, సింహాన్ని లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా జక్కన్న సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.


ప్రియాంక రోల్ అదేనా..!


అయితే, తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది 'SSMB29'లో ప్రియాంక పాత్ర గురించి. ఈ అడ్వెంచర్ మూవీలో హీరోతో పాటు ప్రియాంక పాత్రకు సైతం అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. లేడీ విలన్‌గా నెగిటివ్ రోల్‌లో ఆమె కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఆమె రోల్‌ను దర్శక ధీరుడు రూపుదిద్దుతున్నారని సమాచారం. ఆమె పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్‌లో కనిపిస్తుందని ఇండస్ట్రీ గాసిప్. మహేష్ బాబు పాత్ర ప్రత్యేక ప్రయోజనం కోసం ఒక క్రేజీ ఆఫ్రికన్ అడ్వెంచర్‌ను ప్రారంభించే విధంగా ఈవెంట్లను నిర్వహించే సంపన్న బిలియనీర్‌గా ఆమె నటిస్తుందని పుకారు ఉంది. అయితే, ఇది గాసిప్ మాత్రమే అయినా సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే మూవీ టీం స్పందించే వరకూ ఆగాల్సిందే.


ఆ రూల్స్ బ్రేక్ చేస్తే..






కాగా, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా మూవీ టీం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా నటించే వాళ్ల గురించి తప్ప ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జక్కన్న, మూవీ టీం జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో ఇప్పటికే చిత్ర బృందానికి గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. 


దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి విషయాన్ని బయటకు చెప్పడానికి వీల్లేదు. దర్శక నిర్మాతల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా సమాచారం లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అటు, హీరోతో సహా సెట్‌లో ఉన్న వారెవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ కోసం భారీ సెట్స్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Also Read: Konidela Upasana: మెగాస్టార్ కోడలు ఉపాసన గొప్ప మనసు - మామ పవన్‌కు తోడుగా సహాయ కార్యక్రమాలు, పిఠాపురం నుంచే శ్రీకారం