Megastar Chiranjeevi: వాలెంటైన్స్ డే సందర్భంగా సినీ సెలబ్రిటీలంతా తమ పార్ట్‌నర్స్‌తో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అందులో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో బిజీ అయ్యారు. ఎంత బిజీగా ఉన్న సమయం దొరికిన ప్రతీసారి తన భార్య సురేఖతో ట్రిప్స్ ప్లాన్ చేయడం మొదలుపెట్టారు చిరు. తాజాగా మరోసారి వాలెంటైన్స్ డే సందర్భంగా సురేఖతో వెకేషన్‌కు వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు మెగాస్టార్. అంతే కాకుండా తన అప్‌కమింగ్ మూవీ ‘విశ్వంభర’పై అప్డేట్ కూడా అందించారు.


అమెరికా వెళ్తున్నాను..


‘‘నా బెటర్ హాఫ్ సురేఖతో కలిసి చిన్న హాలిడే కోసం అమెరికా వెళ్తున్నాను. తిరిగి వచ్చిన వెంటనే విశ్వంభరకు షూట్ చేస్తాను. త్వరలోనే కలుస్తాను. అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే’’ అంటూ ఫ్లైట్‌లో సురేఖతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి. ఇటీవల తన ప్రతీ సినిమా పూర్తయిన తర్వాత సురేఖతో కలిసి ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారని, భార్యతో అలా సమయం గడపాలి అనుకోవడం చాలా మంచి విషయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘విశ్వంభర’ కోసం భారీ వర్కవుట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు చిరు. ఈ వయసులో కూడా ఇలాంటి వర్కవుట్స్ చేయడం చాలా కష్టమంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.






షూటింగ్‌కు బ్రేక్..


కొన్ని రోజుల క్రితం 'విశ్వంభర' సినిమా కోసం మెగాస్టార్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో చిరంజీవి హెవీ వర్కౌట్స్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వయసులో కూడా చిరు ఇంతలా కష్టపడుతుడటం చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇక ఈ వీడియో చివర్లో చిరంజీవి 'గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర' అంటూ ఫుల్ జోష్ లో చెప్పారు. ఈ వీడియో కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. వర్కవుట్స్‌తో సిద్ధంగా ఉండడంతో వెంటనే ‘విశ్వంభర’ సెట్‌లో చిరంజీవి అడుగుపెడతారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వాలెంటైన్స్ డే కాబట్టి భార్య సురేఖతో సమయాన్ని గడిపిన తర్వాతే మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టాలని చిరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.


ఎన్నో ఏళ్ల తర్వాత..


‘బింబిసార’తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు వశిష్ట. రెండో సినిమాతోనే చిరంజీవి లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ ఫస్ట్ లుక్.. ఇప్పటికే చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్ మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత ‘విశ్వంభర’ కోసం త్రిషతో చేతులు కలిపారు చిరంజీవి. వీరిద్దరూ కలిసి ఒకప్పుడు ‘స్టాలిన్’ అనే సినిమాలో నటించారు. మళ్లీ ఇంతకాలం తర్వాత వీరిద్దరిని కలిపి స్క్రీన్‌పై చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: నదిలో దారుణ స్థితిలో దర్శకుడి మృతదేహం - అసలు ఏం జరిగింది?