'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ఫేమ్, ఇటీవల 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతన్య రావ్ (Chaitanya Rao) కథానాయకుడిగా గౌతమ్స్ ఈగల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. పతాకంపై ఎం. గౌతమ్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో హృతికా శ్రీనివాస్ (Hrithika Srinivas) కథానాయిక. ఈ చిత్రానికి సాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చిన సి. కళ్యాణ్
చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్... హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎఫ్‌డీసీ చైర్మన్ అనీల్ కురుమాంచలం కెమెరా స్విచ్ ఆన్ చేయగా... ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు. బెక్కం వేణు గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాత ఎం. గౌతమ్, సి. కళ్యాణ్ చేతుల మీదుగా దర్శకుడు సాయి తేజ స్క్రిప్ట్ అందుకున్నారు. ఈ పూజా కార్యక్రమానికి నిర్మాత రాచాల యుగంధర్ ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యారు. ఇంకా పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.
Also Read : 'బ్రో' శాంపిలే, 'ఉస్తాద్'లో సెటైర్స్ సునామీ - టార్గెట్ వైసీపీ!
నిర్మాతగా నా తొలి చిత్రమిది - ఎం. గౌతమ్
తమ గౌతమ్స్ ఈగల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి సంస్థలో చేస్తున్న తొలి సినిమా ఇదని నిర్మాత ఎం. గౌతమ్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ జంటగా నటిస్తున్నారు. మా దర్శకుడు సాయి తేజ ఓ డిఫరెంట్ పాయింట్ తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేశారు. కొత్తగా పెళ్లైన జంటలో... భర్త అనుకోని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని అతను ఎలా హ్యాండిల్ చేశాడు? అనే కథాంశంతో సినిమా రూపొందుతోంది. మంచి కామెడీ, లవ్, ఎమోషన్స్... కుటుంబ ప్రేక్షకులు, యువతను ఆకట్టుకునే అంశాలను మేళవించి ఈ సినిమా తీస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రేక్షకులకు తెలియజేస్తాం'' అని చెప్పారు. మంచి కథతో రూపొందుతోన్న సినిమాలో తాను కూడా భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని చైతన్య రావ్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ ఇదని ఆయన చెప్పారు.
Also Read : ఆగ్రహంతో ఊగిపోతున్న అల్లు అర్జున్ అభిమానులు - మైత్రికి మాస్ వార్నింగ్!
చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణ చైతన్య, సాయి శ్రీనివాస్, సుదర్శన్, మహేష్ అచంట (రంగస్థలం మహేష్), మహేష్ విట్టా, రాజేష్ ఉల్లి, షిన్నింగ్ ఫణి తదితరులు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ : ప‌్రదీప్తి భూమ, ప్రొడక్షన్ కంట్రోలర్ : కాస కిరణ్ కుమార్, కళా దర్శకుడు : రామాంజనేయులు, కూర్పు : విజయ్ ముక్తావరపు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : మోహన్ పున్న, లైన్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణ, నృత్య దర్శకత్వం : జెడి మాస్టర్, సినిమాటోగ్రఫీ: పి.సి. మౌళి, సంగీతం : గ్యాని, నిర్మాణ సంస్థ : గౌతమ్స్ ఈగల్ ఎంటర్‌టైన్మెంట్, నిర్మాత : ఎం. గౌతమ్, రచన - దర్శకత్వం : సాయి తేజ.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial