బీచ్‌లో అలివేలు, ‘దయా’ షూటింగ్ వీడియో షేర్ చేసిన ఈషా రెబ్బా

పవన్ సాధినేని తీసిన సిరీస్ 'దయా' ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జేడీ చక్రవర్తి సరసన అలివేలు పాత్రలో మెప్పించిన ఈషా రెబ్బా.. ఈ సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేయగా.. ఇప్పుడది వైరలవుతోంది.

Continues below advertisement

Dayaa : జేడీ చక్రవర్తి హీరోగా దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన సిరీస్ 'దయా'. ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సీరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చేపలు ట్రాన్స్‌పోర్ట్ చేసే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ గా జేడీ చక్రవర్తి నటించగా.. అతని భార్య అలివేలు పాత్రలో ఈషా రెబ్బా కనిపించింది. హీరోయిజం కోసమో, ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడం కోసమో అంటూ కథ నుంచి పక్క దారుల్లోకి వెళ్లకుండా... కేవలం కథను చెప్పిన తెలుగు వెబ్ సిరీస్‌లలో 'దయా' ఒకటిగా నిలుస్తోందని ప్రేక్షకులు అంటున్నారు. అయితే తాజాగా ఈ సీరీస్ కు వస్తున్న ఆధరణపై ఈషా రెబ్బా స్పందించింది. ‘దయా’ సీరీస్ పై ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు తెలిపింది. 

Continues below advertisement

ఈషా రెబ్బా ఈ సీరీస్ చేసిన పాత్ర పరిధి పరిమితమే. స్క్రీన్ మీద కనిపించే సన్నివేశాలు తక్కువే అయినప్పటికీ... ప్రేక్షకులకు గుర్తుండేలా రూపొందించారు. ఈ పాత్రకు ఈషా.. తన వంతుగా 100కు వంద శాతం న్యాయం చేసిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అందుకు మొదటి కారణం క్యారెక్టర్ ట్విస్ట్ అయితే... రెండోది గర్భిణి పాత్రలో ఆమె నటించడం. ఇక జర్నలిస్ట్ పాత్రలో కనిపించిన రమ్యా నంబీసన్ కూడా చక్కగా నటించింది. ఆమె భర్తగా కమల్ కామరాజు కూడా పాత్రకు తగ్గట్టుగా మెప్పించారు. ఇదిలా ఉండగా స్మాల్ స్క్రీన్ మీద తనకున్న ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలో కనిపించిన విష్ణు ప్రియ భీమనేని సైతం తన నటనతో ఆకట్టుకుంది. మొత్తానికి 'దయా' .. పార్ట్ 2 పై ఆసక్తి రేకెత్తించేలా ఉందని చెప్పవచ్చు. 

ఈ సీరీస్ పై, సీరీస్ లో నటించిన నటులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈషా రెబ్బా సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది. అలివేలు పాత్ర తన మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని రాసుకొచ్చింది. ఈ సీరీస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. దాంతో పాటు సీరీస్ కోసం బీచ్ దగ్గర షూట్ చేసినప్పటి వీడియోను షేర్ చేసింది. ఈ క్లిప్పింగ్ లో ఈషా.. ఓ సాధారణ మహిళగా కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వరంగల్ లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. హైదరాబాద్ లో పెరిగింది. 2013లో 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈషా రెబ్బా.. ఆ తర్వాత 'అమీ తుమీ', 'దర్శకుడు', 'మాయా మాల్', 'బ్రాండ్ బాబు', 'సవ్యసాచి' సినిమాల్లోనూ నటించింది. సినిమాల్లో నటిస్తూనే.. సామాజిక కార్యకలాపాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటుంది.

Read Also : Mr Pregnant: అఖిల్ డెలివరీ టైమ్‌లో అలా చేశాను: 'మిస్టర్ ప్రెగ్నెంట్' ట్రైలర్ లాంచ్‌లో నాగార్జున

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement