రజనీకాంత్ ‘జైలర్’ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. 2021లో వచ్చిన ‘అన్నాత్తే (తెలుగులో పెద్దన్న)’ తర్వాత రజనీ నటిస్తున్న సినిమా ఇదే. ‘వరుణ్ డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో వచ్చిన ‘కబాలి’ తర్వాత రజనీ సినిమాపై ఇంత హైప్ రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమా విడుదల సందర్భంగా కంపెనీలు సెలవు ప్రకటించడం కూడా ప్రారంభించాయి.
తాజాగా ‘యూనో ఆక్వా కేర్’ అనే కంపెనీ కూడా ‘జైలర్’ రిలీజ్ సందర్భంగా సెలవు ప్రకటించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ బ్రాంచిల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా టికెట్లు కూడా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన సర్క్యులర్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.
'జైలర్' ట్రైలర్ కూడా గత వారం విడుదల అయింది. ఈ ట్రైలర్ సూపర్ హిట్ అయింది. దీన్ని మన తెలుగు ప్రేక్షకులకు ముందు సంతోషం కలిగించే అంశం ఏమిటంటే... సునీల్ ఎంట్రీ! రజనీ కంటే ముందు స్క్రీన్ మీద సునీల్ కనిపించారు. సీబీఐ అధికారులు ఇంటికి వస్తే... 'డొనేషన్ ఏమైనా కావాలా?' అని సునీల్ అడుగుతారు.
సునీల్ ఎంట్రీకి ముందు చాలా యాక్షన్ సన్నివేశాలు వచ్చాయి. కొన్ని పోలీసు వాహనాలపై ఎవరో అటాక్ చేసినట్లు చూపించారు. దాంతో మాంచి యాక్షన్ సినిమా అని ఫీల్ కలిగించారు. రజనీకాంత్ ఎంట్రీ అయితే హైలైట్! ఆయన్ను చాలా పిరికివాడిగా చూపించారు. పిల్లి నుంచి పులిగా మారినట్లు హీరోయిజం చూపించారు. అక్కడి నుంచి అసలు సిసలైన యాక్షన్, సూపర్ స్టార్ హీరోయిజం మొదలయ్యాయి. క్యారెక్టర్ విషయానికి వస్తే... రజినీకాంత్ 'జైలర్' రోల్ చేశారు. ఆయన భార్య పాత్రలో రమ్యకృష్ణ కనిపించారు. రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు. రజనీకాంత్ కుమారుడు పోలీస్. మనవడి మీద ఎటాక్ జరగబోతే... రక్షించడం, ఆ తర్వాత విలన్స్ మీద రజనీకాంత్ ఎటాక్ చేయడం కథగా తెలుస్తోంది.