Aamir Khan Remuneration In Coolie Movie: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో తలైవాతో పాటు సైమన్‌గా విలన్ రోల్‌లో కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్‌లో అలరించారు. అయితే, ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే హీరోతో పాటు అందరి రెమ్యునరేషన్లపై వార్తలు వైరల్‌గా మారాయి. 

Continues below advertisement


ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్‌పై మామూలు ప్రచారం జరగలేదు. ఆయన గెస్ట్ రోల్ కోసం ఏకంగా రూ.20 కోట్లు తీసుకున్నారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో వీటిని మూవీ టీం ఖండించింది. ఎవరు ఎంత చెప్పినా ఆ రూమర్లకు మాత్రం చెక్ పడలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమిర్ ఖాన్ ఈ మూవీలో ఆయన రెమ్యునరేషన్ గురించి స్పందించారు.


రెమ్యునరేషన్ ఎంతంటే?


ఈ మూవీ కోసం తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని... రజినీ సార్‌తో కలిసి నటించడమే తనకు పెద్ద రెమ్యునరేషన్ అని ఆమిర్ తెలిపారు. 'రజినీకాంత్‌పై నాకు ఉన్న ప్రేమ, అభిమానాలకు ఎవరూ వెలకట్టలేరు. ఆయనతో కలిసి తెరపై కనిపించడమే నాకు పెద్ద రివార్డు. ఇందులో నేను గెస్ట్ రోల్‌లో మాత్రమే కనిపించాను. రజినీకాంత్, నాగార్జునలే అసలైన హీరోలు. 'కూలీ' సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారంటే అది వారిని చూసేందుకే కానీ నా కోసం మాత్రం కాదు.' అంటూ చెప్పారు. దీంతో కొన్ని రోజులుగా ఆమిర్ రెమ్యునరేషన్‌పై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టినట్లయింది.


Also Read: అమితాబ్ 'KBC'లో ఆపరేషన్ సింధూర్ ఆఫీసర్స్ - మనీతో పాటు అందరి మనసులు కూడా గెలిచారు


రూ.200 కోట్ల క్లబ్‌లో...


ఫస్ట్ డే రూ.150 కోట్ల కంటే ఎక్కువగా కలెక్ట్ చేసిన ఈ మూవీ తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. తొలి రోజు కలెక్షన్లతోనే కోలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన మూవీగా చరిత్ర సృష్టించింది. ఫస్ట్ డే రూ.151 కోట్లు రాగా... ఇండియావ్యాప్తంగా రూ.65 కోట్ల నెట్ వసూళ్లైనట్లు తెలుస్తోంది. గ్రాస్ పరంగా ఇండియాలో రూ.75 కోట్లు వచ్చాయి. ఇక రెండో రోజు రూ.53 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలిపి త్వరలోనే రూ.250 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమంటూ ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.


సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో 'కూలీ'ని నిర్మించారు. తలైవాతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, రచితా రామ్ కీలక పాత్రలు పోషించారు. అటు, ఇండస్ట్రీలోకి వచ్చి రజినీకాంత్ 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తి అని ప్రశంసించారు.