Operation Sindoor Officers Participated In Amitabh KBC Show: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ హోస్ట్‌గా 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC) ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 17వ సీజన్ సాగుతుండగా... ఎంతోమంది సామాన్యులు తమ నాలెడ్జ్‌తో మనీ గెలుచుకుంటున్నారు. తాజాగా... ఇండిపెండెన్స్ డే సందర్భంగా 'ఆపరేషన్ సింధూర్' ఆఫీసర్స్ ఈ షోలో పాల్గొన్నారు. క్విజ్‌లో తమ ఆటతోనే కాకుండా 'ఆపరేషన్ సింధూర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
ఆ ముగ్గురు ధీర వనితలకు సెల్యూట్
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్... పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మెరుపు దాడుల్లో పాకిస్థాన్‌లోని కీలక ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దేశమంతా ఈ ఆపరేషన్‌పై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రతీ భారతీయుని గుండె సగర్వంగా ఉప్పొగ్గింది. ఆపరేషన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు రక్షణ, విదేశాంగ శాఖలు, భద్రతా బలగాలకు చెందిన సీనియర్ అధికారులు, మహిళా అధికారులు మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు.
భారత భద్రతా బలగాలకు చెందిన సైన్యం నుంచి కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళం నుంచి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, నావికా దళం నుంచి కమాండర్ ప్రేరణ డియోస్థలీ తాజాగా 'KBC' షోలో పాల్గొన్నారు. కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాకుండా ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా తాము చూపిన ధైర్య సాహసాలను వారు పంచుకున్నారు.
Also Read: ఆది పినిశెట్టితో వర్క్ ఓ ఆనంద యాత్ర - 'మయసభ'లో KKN రోల్‌కు జీవం పోశారంతే
ఎంత గెలుచుకున్నారంటే?
ఈ షోలో అద్భుతంగా ఆడిన మహిళా అధికారులు రూ.25 లక్షలు గెలుచుకున్నారు. 'ఇంగ్లాండ్ లీసెస్టర్ విక్టోరియా పార్కులోని 'ఆర్చ్ ఆఫ్ రిమెంబరెన్స్' స్మారక చిహ్నాన్ని రూపొందించిన వ్యక్తే ఇండియాలో రూపొందించిన స్మారక చిహ్నం ఏంటి?' అనే ప్రశ్నకు A - విక్టోరియా మెమోరియల్ B - గేట్ వే ఆఫ్ ఇండియా C - ఫోర్ట్ సెయింట్ జార్జ్ D - ఇండియా గేట్ అనే ఆప్షన్స్ ఇచ్చారు.
ఈ ప్రశ్నకు వారు ఆడియన్స్ పోల్ ఉపయోగిస్తూ... D - ఇండియా గేట్ అంటూ ఆన్సర్ లాక్ చేశారు. అది సరైన సమాధానం కాగా రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఫస్ట్ వరల్డ్ వార్ స్మారక చిహ్నం 'ఆర్చ్ ఆఫ్ రిమెంబరెన్స్'ను సర్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు. ఆయనే ఇండియా గేట్ స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మనీతో పాటే మనసులు కూడా...
ఈ షో ద్వారా వారు గెలుచుకున్న రూ.25 లక్షల మొత్తాన్ని వారు సంబంధింత సంస్థలతో ఉన్న సంక్షేమ నిధులకు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో వారిపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ చూసిన నెటిజన్లు 'భారత్ మాతాకీ జై' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.