Deva Katta About Aadhi Pinisetty Performance In Mayasabha Series: ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మయసభ'. ఈ సిరీస్‌కు దేవా కట్టా దర్శకత్వం వహించగా... ప్రస్తుతం 'సోనీ లివ్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. కృష్ణమ నాయుడు రోల్‌లో ఆది పినిశెట్టి, రామిరెడ్డి రోల్‌లో చైతన్యరావు అదరగొట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆది పినిశెట్టిపై డైరెక్టర్ దేవా కట్టా ప్రశంసలు కురిపించారు. కృష్ణమ నాయుడు రోల్‌కు ఆదిని ఎంపిక చేయడం వెనుక ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
రోల్ ఏదైనా... అదే డెడికేషన్
రోల్ ఏదైనా ఆది పినిశెట్టి ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేస్తారని ప్రశంసించారు దేవా కట్టా. 'ఆది తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక V చిత్రమ్ సినిమాతో మొదలుపెట్టాడు. 2009లో తమిళంలో వచ్చిన ఈరమ్తో గుర్తింపు తెచ్చుకున్నారు. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, మృగం, మరగత నాణయం వంటి చిత్రాల్లో అద్భుత నటనతో హీరో, విలన్ లేదా సపోర్టింగ్ పాత్ర ఏదైనా ఒకే స్థాయి నైపుణ్యంతో చేయగల వెర్సటైల్ నటుడిగా తన ముద్ర వేశాడు. 'నిన్ను కోరి'లో ఫస్ట్ టైం గమనించా. ఆయన డిక్షన్, పాత్రకు తాను తెచ్చిన హుందాతనం నన్ను ఆకట్టుకున్నాయి.' అని తెలిపారు.
Also Read: బాలీవుడ్ ట్రాప్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు, చరణ్ ప్రభాస్ తర్వాత NTR..ఆగండి ఆలోచించండి బ్రదర్!
KKN రోల్ చేయాలని రిక్వెస్ట్
మయసభ OTT ఫార్మాట్‌కి మారిన వెంటనే, లీడ్ పాత్రల్లో తన మనసుకి తట్టిన ఫస్ట్ పేరు ఆది అని... స్క్రిప్ట్ పంపి, 8 గంటల జూమ్ కాల్‌లో మొత్తం కథ నరేట్ చేసినట్లు చెప్పారు దేవా కట్టా. '2 లీడ్ పాత్రల్లో ఏదైనా చేయడానికి ఆయన్ను సిద్ధంగా ఉంచాను. చైతన్య రావును ఫైనల్ చేసిన తర్వాత, తాను MSR పాత్రకు సహజంగా ఉంటాడని భావించి, ఆదిని KKN పాత్ర చేయమని రిక్వెస్ట్ చేశా. అక్కడ నుంచి ఆదితో పని చేయడం ఒక ఆనందయాత్ర.
KKN కారెక్టర్ ఎన్నో పరిమితులు, లేయర్స్తో నిండిన ఛాలెంజింగ్ రోల్. నత్తి, ఆర్థిక పరిమితులతో పోరాడుతూ, అపరిమితమైన లక్ష్యాలతో కూడిన పాత్ర. ప్రతి సమస్యని ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఎదుర్కొనే నాయకత్వ లక్షణం ఉన్న పాత్ర. ఆది KKN పాత్రను ఒక మరాథాన్‌లా తీసుకున్నారు. ఆ కాలపు రాజకీయ వాతావరణాన్ని గ్రహించి, తన బాడీ లాంగ్వేజ్‌ను దిద్దుకుంటూ, డైలాగ్‌లతోనే కాదు, మాటల మధ్య నిశ్శబ్దంతో కూడా ఎంతో లైఫ్ తీసుకొచ్చారు.' అని తెలిపారు.
బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవే...
'మూడో ఎపిసోడ్‌లో బస్సులో MSR చేతిని చాచి పలకరించే ముందు తన రక్తమయమైన చేతిని చూసే దృశ్యం' ట్రైలర్‌లో బెస్ట్ షాట్ అని దేవా కట్టా తెలిపారు. నామినేషన్ పేపర్లను తీసుకుంటున్నప్పుడు CBRకు బదులివ్వడంలో, అతని స్టైల్లోనే సమాధానం ముగించే విధంగా డైలాగ్ ఎక్స్టెండ్ చెయ్యడం.. ఆ హీరోయిక్ మోమెంట్‌ని మరో ఎత్తుకు తీసుకెళ్లిందని దేవా కట్టా చెప్పారు.