Bobby Deol Villain Role Redesigned In Hari Hara Veeramallu Movie: ప్రస్తుతం మూవీ లవర్స్‌తో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న మూవీ 'హరిహర వీరమల్లు'. ఈ పీరియాడికల్ అడ్వెంచర్ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో యోధుడిగా కనిపించనుండడంతో హైప్ క్రియేట్ అయ్యింది. జులై 3న ట్రైలర్ రిలీజ్ కానుండగా... ఎన్నో విషయాలు ఆకట్టుకుంటున్నాయి.
విలన్ రోల్... చాలా పవర్ ఫుల్...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ అంటేనే ఓ స్పెషల్ క్రేజ్. ఆయన సినిమాలో విలన్ రోల్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పీరియాడికల్ అడ్వెంచర్ డ్రామాలో ఓ యోధుడికి విలన్ అంటే వేరే లెవల్ ఉండాల్సిందే. 'హరిహర వీరమల్లు' మూవీలో డైరెక్టర్ జ్యోతికృష్ణ విలన్ రోల్‌ను అంతే పవర్ ఫుల్‌గా డిజైన్ చేశారు.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా నటించారు. 'యానిమల్' సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. 'హరి హర వీరమల్లు'లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తుండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. నిజానికి 'హరిహర'లో ఆయన రోల్ కోసం ముందుగానే కొన్ని సీన్స్ షూట్ చేశారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. కానీ 'యానిమల్' మూవీ చూసిన తర్వాత బాబీ డియోల్ రోల్ పూర్తిగా రీ డిజైన్ చేశారు. ఆయన విలన్ రోల్‌ను సరికొత్తగా తీర్చిదిద్ది పవర్ ఫుల్‌గా మలిచారు.
Also Read: 'కన్నప్ప' మూవీ పైరసీ లింక్స్ - ఆడియన్స్‌కు విష్ణు మంచు రిక్వెస్ట్
స్టార్ డమ్... గ్రేట్ ఎక్స్‌పీరియన్స్
'యానిమల్ మూవీలో బాబీ డియోల్ యాక్టింగ్ అద్భుతం. రోల్‌కు డైలాగ్స్ లేకపోయినా తన హావభావాల ద్వారానే ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించారు. అందుకే మా సినిమాలో కూడా ఆయన రోల్ కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్తగా ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకు తగిన విధంగానే ముందుగా షూట్ చేసినా మళ్లీ ఆయన రోల్ రీ డిజైన్ చేశాను. సినిమాలో ఆయన రోల్ చాలా అద్భుతంగా ఉంటుంది. బాబీ డియోల్ తనని తాను కొత్తగా మలుచుకోవడానికి ఇష్టపడతారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం ఓ గొప్ప ఎక్స్‌పీరియన్స్.' అని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపారు.
జులై 24న రిలీజ్... ఫ్యాన్స్ వెయిటింగ్
జులై 3న ఉదయం 11:10 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ తెలిపింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో జులై 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ 4 సాంగ్స్ రిలీజ్ కాగా ట్రెండింగ్‌గా మారాయి.
ఈ సినిమాకు తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా సగ భాగం పూర్తైన తర్వాత ఆయన కొన్ని కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఫస్ట్ పార్ట్‌తో పాటు రెండో భాగానికి కూడా ఆయనే దర్శకత్వం వహించనున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. బాబీ డియోల్ విలన్ రోల్‌లో... అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, సత్యరాజ్, పూజిత పొన్నాడ, అనసూయ తదితరులు తదితరులు కీలకపాత్రలు పోషించారు. మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు నిర్మించారు.