Allari Naresh's New Movie Title Announced: యంగ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల డిఫరెంట్ రోల్స్‌తో దూసుకెళ్తున్నారు. ఆయన లాస్ట్ మూవీ 'బచ్చలమల్లి' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా... సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీ, ‌టైటిల్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

కిక్ ఇచ్చే టైటిల్

అల్లరి నరేష్ హీరోగా టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' ఓ మూవీని నిర్మించబోతోంది. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా... టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆడియన్స్‌కు పేరు వింటేనే కిక్ ఇచ్చేలా 'ఆల్కహాల్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'విభిన్న రీతిలో మునిగిపోతున్నా. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా మన హీరోను చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం.' అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.

పోస్టర్‌లో అల్లరి నరేష్ సగం వరకూ 'ఆల్కహాల్'లో మునిగిపోయినట్లు కనిపిస్తుండగా హైప్ క్రియేట్ అవుతోంది. ఆయన సరసన రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని 'ఫ్యామిలీ డ్రామా' ఫేం మెహర్ తేజ్ దర్శకత్వం వహించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. గిబ్రాన్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Also Read: 'జయమ్ము నిశ్చయమ్ము రా: జగపతి బాబుతో 'జీ తెలుగు' కోసం 'కల్కి 2898 ఏడీ' నిర్మాణ సంస్థ కొత్త షో - ప్రోమో చూడండి

లైనవ్ మార్చేశారు

ఒకప్పుడు కామెడీ సినిమాలతో ఎంటర్‌టైన్ చేసే అల్లరి నరేష్ ఇప్పుడు లైనప్ మార్చేశారు. నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఆ ఒక్కటీ అడక్కు, బచ్చలమల్లి ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్‌ మూవీస్‌తో ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతున్నారు. గత కొంతకాలంగా ఆయన ఖాతాలో సోలో హిట్ పడలేదు. ప్రస్తుతం హారర్ థ్రిల్లర్‌తో ఆడియన్స్‌ను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. పొలిమేర, పొలిమేర 2 మూవీస్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ షో రన్నర్‌గా వ్యవహరిస్తోన్న '12A రైల్వే కాలనీ' మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు.

హారర్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ 'ఆల్కహాల్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ డిఫరెంట్‌గా అదిరిపోయిందని... ఈసారి హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్టోరీ ఏంటి అనే దానిపై ఆసక్తి నెలకొంది.