Kiran Abbavaram First Look In K RAMP Movie: రీసెంట్‌గా 'క' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నారు. ఈ మూవీకి 'కే ర్యాంప్' అనే యూనిక్ టైటిల్ ఫిక్స్ చేయగా తాజాగా హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. డిఫరెంట్‌గా మాస్ స్టైల్‌లో కిరణ్ లుక్ అదిరిపోయింది.
మాస్ గెటప్‌తో...
'కే ర్యాంప్' మూవీలో మాస్ గెటప్‌తో కిరణ్ అబ్బవరం అదరగొట్టారు. చొక్కా, లుంగీ ధరించి నవ్వుతూ డ్యాన్స్ చేయగా... వెనుక లవ్ సింబల్‌తో ఫైర్ ఎఫెక్ట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. స్టైల్‌తో పాటు ఫైర్, ఫన్ కలగలిపేలా మూవీ ఉండబోతోందని పోస్టర్ బట్టి అర్థమవుతోంది. ఫస్ట్ లుక్‌తోనే హైప్ క్రియేట్ చేయగా... మరోసారి హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ చిత్రంతోనే జైన్స్ నాని దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మూవీని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కిరణ్, చేతన్ కాంబోలో ఇది మూడో చిత్రం. ఇంతకు ముందు వచ్చిన 'ఎస్ఆర్ కల్యాణమండపం', 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీస్ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి.
దీపావళికి రిలీజ్
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఈ దీపావళికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పోస్టర్‌తోనే మాస్ హైప్ క్రియేట్ చేయగా... టెక్నికల్ టీం నుంచి కాస్ట్యూమ్స్ వరకూ ప్రతి విభాగంలోనూ 'కే ర్యాంప్' మూవీ టీం స్పెషల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
వరుస సినిమాలు
'క' మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన లాస్ట్ మూవీ 'దిల్ రూబా' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం కిరణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా లవ్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా... సాయి రాజేష్ స్టోరీ అందించారు. కిరణ్ సరసన శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా చేస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా 'కే ర్యాంప్'తో రాబోతున్నారు. 'క' మూవీకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.