Inaya Sultana With Venu Swamy: 'బిగ్‌బాస్‌' బ్యూటీ ఇనయ సుల్తానా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇనయ సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బర్త్‌డే పార్టీలో ఆర్జీవీతో డ్యాన్స్ చేసి సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయంది. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌లోకి అడుగు పట్టిన ఆమె తనదైన ఆట తీరుతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో  అర్థంకాకుండా వారానికో కొత్త కంటెంట్‌ ఇస్తూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసింది. నిజానికి హీరోయిన్‌ అవుదామని ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఇనయ.. ఇండస్ట్రీలో ఎన్నో చేదు అనుభవాలు చూసింది. ముఖ్యంగా తన ఇంటిని, సొంతవాళ్లను వదిలేసి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు బిగ్‌బాస్‌ హౌజ్‌లో చెప్పింది. అంతేకాదు ఈ బిగ్‌బాస్‌ తనకు చాలా ముఖ్యమంటూ పలుమార్లు ఎమోషనల్‌ అయ్యింది.


ఇక ఈ రియాలిటీ షోతో అయినా ఆఫర్లు అందుకోవాలనుకుంది. అనుకున్నట్టు బిగ్‌బాస్‌తో ఎంతో క్రేజ్‌ తెచ్చుకున్న ఇనయా..  బయటకు వచ్చాక తన కల నెరవేరుతుందని ఆశపడింది. ఈ షో అనంతరం ఆఫర్లు రావడం ఖాయమని, హీరోయిన్‌ అవ్వాలనే తన కల ఇక నెరవేరినట్టే అని ఆశ పడింది. కానీ బయటకు వచ్చాక అనుకున్నది ఒక్కటి.. అయిందొక్కటి అన్నట్టుగా మారిపోయింది. బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక కొన్ని రోజులపాటు ఆమె పేరు బాగా వినిపించింది. కానీ, ఆ క్రేజ్‌ను కంటిన్యూ చేయలేకపోయింది. కొత్తలో ఓ సినిమా ఆఫర్‌ వచ్చినా.. అది పెద్దగా ఆదరణ పొందలేదు. ఫస్ట్‌ టైం హీరోయిన్‌గా చేసిన ఆ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లింది. అయితే ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు ఆవగింజంత లక్క్‌ కూడా ఉండాలి. అప్పుడే ఆశించిన సక్సెస్‌ సాధ్యమవుతుంది. లేదంటే ఎంత కష్టపడ్డ ఫలితం కనిపించదు. అందుకు చాలా మంది సెలబ్రెటీలు ఉదాహరణగా ఉన్నారు.


Also Read: 'హనుమాన్‌' డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మకి షాకిచ్చిన ట్విటర్‌ - అదే కారణమా?


అందుకే తమ లక్‌ కోసం ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. అలా ఓ జ్యోతిష్యుడు బాగా ఫేమస్‌ అయ్యాడు. స్టార్‌ హీరోయిన్‌ రష్మికకు పూజలు చేసి అవకాశాలు వచ్చేలా హెల్ప్‌ చేసిన వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడు సెలబ్రెటీల జాతకంపై కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. ఈసారి మాత్రం ఇనయ వల్ల మరోసారి తెరపైకి వచ్చాడు. ఇటీవల ఇనయ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌తో వేణు స్వామి మరోసారి హాట్‌టాపిక్‌ అయ్యాడు. రష్మిక, నిధి అగర్వాల్‌, అషు రెడ్డి బాటలోనే వేణుస్వామితో పూజలు చేయించుకుంది ఇనయ. ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇంకేముంది నువ్వు కూడా వేణుస్వామి శిష్యురాళ్ల జాబితాలో చేరిపోయావా? అని నెటిజన్లు ఇనయను ఓ ఆటాడుకుంటున్నారు. 


నువ్వు ఎలా పూజలు చేస్తావు?


ఆమె షేర్‌ చేసిన ఓ వీడియోలో కొందరు మెడలో పూల మాలలు వేసుకుని, నుదుటిన బొట్టు పెట్టుకుని ఉన్నారు. ఈ సందర్భంగా వేణు స్వామి వారిపై కలషం నీళ్లు చల్లుతూ పూజలు చేస్తున్నారు. ఏంటీ పూజ చేయించుకున్న మాత్రానా ఫేమస్‌ అయిపోతా అనుకుంటున్నావా? స్టార్‌ హీరోయిన్ అయిపోతా అనుకుంటున్నావా? అని కొందరు ఆమె సటైర్లు వేస్తుంటే.. మరికొందరు అసలు ఇలాంటివి ఎలా నమ్ముతారు? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మరికొందరైతే నువ్వు ముస్లిం కదా.. పూజలు ఎలా చేస్తున్నావ్‌? అని ప్రశ్నించారు. దీనిపై ఇనయ స్పందిస్తూ తనదైన స్టైల్లో సదరు నెటజన్‌కు ఇచ్చి పడేసింది. "నేను భారతదేశంలో పుట్టాను. ఇక్కడ నాకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఉంది. మధ్యలో నీకేంటి బాధ" గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇనయ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.