Shock To Prasanth Varma: ప్రస్తుతం హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగుతుంది. సినీ ప్రియులంతా 'హనుమాన్' సినిమా, ప్రశాంత్ వర్మ జపమే చేస్తున్నారు. దీంతో గత వారం రోజులుగా ప్రశాంత్ వర్మ పేరు ట్రెండింగ్‌లో నిలుస్తోంది. నిజానికి విడుదలకు ముందు 'హనుమాన్'పై పెద్దగా అంచనాలు లేవు. ముఖ్యంగా ఈ రేంజ్ హిట్ కొడుతుందని ఎవరూ ఊహించలేదు. రిలీజ్ అనంతరం 'హనుమాన్' అంచనాలను మించి టాక్, వసూళ్లు రాబోడుతోంది. దీంతో అంతా ప్రశాంత్ వర్మ పనితనం గురించే మాట్లాడుకుంటున్నారు. తక్కువ బడ్జెట్‌లో సూపర్ మ్యాన్ జానర్‌తో విజువల్ వండర్ క్రియేట్ చేశాడు. దాదాపు పదకొండు భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.
విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ వసూళ్లలో ఏకంగా కేజీఎఫ్ వంటి చిత్రాల రికార్డునే బీట్ చేసింది. హనుమాన్ అంత క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మకు షాక్ తగిలింది. ప్రశాంత్ వర్మ చేసిన ఆ పని వల్ల ఆయన ఫాలోవర్స్ అంతా గందరగోళానికి గురవుతున్నారు. ఏమైంది.. ఎందుకు ఇలా జరిగిందంటూ ట్విటర్లో మొత్తం దీని గురించే చర్చ జరుగుతుంది. ఇంతకి ఏం జరిగిందంటే.. 'హనుమాన్' సినిమాలో హీరో తేజ సజ్జ యాక్టింగ్ చూసి అందరు వావ్ అంటున్నారు. అయినా క్రెడిట్ మాత్రం ప్రశాంత్ వర్మకే పోతుంది. ఎందుకంటే సంక్రాంతి బరిలో అగ్ర హీరో సినిమాల పోటీ ఉన్నప్పటికి ఆయన వెనక్కి తగ్గలేదు. రిలీజ్ విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చిన ధైర్యంగా నిలబడి సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు.
Also Read: 'బింబిసార 2'ను నేను డైరెక్ట్ చేయకపోవడానికి కారణం అదే - దర్శకుడు వశిష్ట
గందగోళంలో ఫాలోవర్స్
దాంతో ఇప్పుడంతా ఆయన కాన్ఫిడెన్స్‌కి ఫిదా అవుతున్నారు. ఫైనల్‌గా హనుమాన్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ.. తాజాగా ఎక్స్‌లో తన ప్రోఫైల్ ఫొటోను మార్చాడు. హనుమాన్ సినిమాను రిప్రజెంట్ చేస్తూ గద పట్టుకుని ఉన్న ఫొటోను ట్విటర్ ప్రోఫైల్ ఫొటోగా పెట్టుకున్నాడు. దీంతో కాన్‌ఫ్యూజ్ అయినా ఎక్స్ ప్రశాంత్ వర్మ ప్రోఫైల్ బ్లూ టిక్‌ను తీసేంది. దీంతో అంతా ఇది ఆఫిషియలా? ఫేకా? తెలియక గందరగోళానికి గురవుతున్నారు. చూస్తుంటే అన్ని ప్రశాంత్ వర్మ పోస్ట్స్ ఉన్నాయి.. కానీ బ్లూ టిక్ లేకపోవడం ఇదేంటని షాక్ అవుతున్నారు. ఒక్కసారిగా అంతా ఇది ఫేక్ అకౌంట్ అని, దానికి నుంచి ప్రశాంత్ వర్మ పోస్ట్స్ చేస్తున్నాడా? అని సర్‌ప్రైజ్ అయ్యారు. ఇక అసలు విషయం గమనించిన కొందరు తిరిగి బ్లూ టిక్ తెచ్చుకో అన్న అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.
కాగా ట్విటర్ ఈ మధ్య ఎక్స్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ట్విటర్‌లో మార్పులు చేసి ఎక్స్‌గా మార్చిన ఎలన్ మాస్క్ బ్లూ టిక్ విషయంలోనూ నిబంధనలు పెట్టాడు. ఈ క్రమంలో ఎక్స్‌లో ప్రోఫైల్ ఫొటో మార్చిన, ప్రోఫైల్ పేరు ఎడిట్ చేసిన బ్లూ టిక్ తీసేస్తున్నారు. తాజా ప్రోఫైల్ ఫోటో మార్చడంతో ప్రశాంత్ వర్మ ఎక్స్ పోస్ట్‌లో బ్లూ టిక్ మాయమైంది. కాగా హనుమాన్ బ్లాక్‌బస్టర్ కావడంతో కొందరు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జల పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్స్ పెడుతున్నారు. ఈక్రమంలో ప్రశాంత్ వర్మ ప్రోఫైల్‌కు ఉన్న బ్లూ టిక్ పోవడంతో ఫాలోవర్స్ అంతా ఫుల్ కన్‌ఫ్యూజలో పడిపోయారు.