మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కొట్టడానికి తమన్నా భాటియా (Tamannaah Bhatia) వెళ్లారు. అదీ ఆవేశంగా, చిత్రీకరణలో అందరూ ఉండగా! చిరంజీవి అంటే అందరికీ గౌరవం. తమన్నాకు కూడా! ఆ విషయాన్ని రెండు మూడు సందర్భాల్లో చెప్పారు కూడా! సెట్‌లో చిరు ఎంటర్ అయితే అందరూ సైలెంట్ అవుతారు. మరి, చిరును తమన్నా కొట్టడం ఏంటి? అంటే... షూటింగులో భాగంగా!


మ్యాటర్ లీక్ చేసిన అనిల్ సుంకర
చిరు లీక్స్ ఫేమస్! సినిమాలో క్రేజీ పాయింట్స్ ఆయన లీక్ చేస్తుంటారు. ఈసారి నిర్మాత అనిల్ సుంకర ఓ విషయం లీక్ చేశారు. చిరంజీవి, తమన్నా జంటగా నటించిన తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). ఇందులో చిరు క్యాబ్ డ్రైవర్ రోల్ చేశారు. తమన్నా న్యాయవాదిగా కనిపించనున్నారు. ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్విస్తాయని చిత్ర బృందం చెబుతోంది. 


ఆగస్టు 12న 'భోళా శంకర్' విడుదల కానున్న సందర్భంగా చిరంజీవి, తమన్నా, కీర్తీ సురేష్, దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకరలను 'గెటప్' శ్రీను ఇంటర్వ్యూ చేశారు. అందులో తమన్నా క్యారెక్టర్ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడారు.


'భోళా శంకర్'లో తమన్నా క్యారెక్టర్ ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్విస్తుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. తమిళంతో పోలిస్తే తెలుగులో హీరోయిన్ క్యారెక్టర్లో చాలా మార్పులు చేశారని తమన్నా ఇంతకు ముందు చెప్పారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు తమన్నా సీన్స్ చూసి చాలా ఎంజాయ్ చేశానని, డబ్బింగ్ థియేటర్లో నవ్వేశానని కీర్తీ సురేష్ సైతం అన్నారు. నిర్మాత అనిల్ సుంకర అయితే... చిరును తమన్నా కొట్టడానికి వెళ్ళే సీన్ చాలా బావుంటుందని చెప్పారు. 


చిరుతో ప్రేమలో పడిన మిల్కీ బ్యూటీ
చిరంజీవితో అందరూ 'మీరు అంటే ఇష్టం' అని చెబుతారని, అయితే తాను మాత్రం 'అయామ్ ఇన్ లవ్ విత్ యు' (మీతో ప్రేమలో పడిపోయా సార్) అని చెబుతానని తమన్నా తెలిపారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ సరసన తమన్నా 'రచ్చ' చేశారు. చిరంజీవితో ఇంతకు ముందు 'సైరా నరసింహా రెడ్డి'లో కలిసి నటించారు. అయితే... ఆ సినిమాలో చిరు, తమన్నా మధ్య పాటలు లేవు. 'భోళా శంకర్'లో ఓ పాట ఉంది.


Also Read : మోసాన్ని సహించలేడు, ఇబ్బంది పడితే తట్టుకోలేడు - ఇదీ 'బ్రహ్మముడి'లో రాజ్ క్యారెక్టరైజేషన్


'ఇంద్ర' సినిమాలో 'దాయి దాయి దామ్మా' పాటను ఎక్కడ అయితే చిత్రీకరించారో... 20 ఏళ్ళ తర్వాత 'భోళా శంకర్'లో చిరు, తమన్నా మీద 'మిల్కీ బ్యూటీ'ని అక్కడ చిత్రీకరణ చేశామని దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు. ఆ పాటలో తమన్నాతో పాటు తనను కూడా సినిమాటోగ్రాఫర్ డడ్లీ అందంగా చూపించాడని చిరంజీవి చెప్పారు. 


Also Read : 'బ్రో' శాంపిలే, 'ఉస్తాద్'లో సెటైర్స్ సునామీ - టార్గెట్ వైసీపీ!



రఘు బాబు, మురళీ శర్మ, రవి శంకర్, 'వెన్నెల' కిశోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, 'హైపర్' ఆది, 'వైవా' హర్ష, రష్మీ గౌతమ్, ప్రదీప్, బిత్తిరి సత్తి, సత్య, 'గెటప్' శ్రీను, వేణు టిల్లు (బలగం దర్శకుడు వేణు ఎల్దండి), 'తాగుబోతు' రమేష్, ఉత్తేజ్, తరుణ్ అరోరా తదితరులు నటించిన ఈ చిత్రానికి కథా పర్యవేక్షణ : సత్యానంద్, మాటలు : తిరుపతి మామిడాల, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial