పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు... సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. విడుదలైన తొలి రోజు నుంచి అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ 'భీమ్లా నాయక్'కు మంచి వసూళ్లు లభించాయి. ఆ తర్వాత కూడా బావుంది. అయితే... గురువారం వసూళ్లు కొంత తగ్గాయి. దానికి తోడు ఈ వారం 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'సెబాస్టియన్ పీసీ 524', 'హే సినామిక' సినిమాలు విడుదల కావడంతో ఈ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

'భీమ్లా నాయక్' తొలి వారం వసూళ్లు... ప్రాంతాల వారీగా!
 
  ఏరియా  ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్
1 నైజాం రూ. 33. 22కోట్లు రూ. 35 కోట్లు
2 సీడెడ్  రూ. 10.09 కోట్లు రూ. 16.5 కోట్లు
3 ఉత్తరాంధ్ర  రూ. 6.91 కోట్లు రూ. 9 కోట్లు
4 గుంటూరు  రూ. 4.82 కోట్లు రూ. 7.20 కోట్లు
5 తూర్పు గోదావరి  రూ. 5.02 కోట్లు రూ. 6.40 కోట్లు
6 పశ్చిమ గోదావరి  రూ. 4.63 కోట్లు రూ. 5.40 కోట్లు
7 కృష్ణా జిల్లా రూ. 3.38 కోట్లు రూ. 6 కోట్లు
8 నెల్లూరు  రూ. 2.33కోట్లు రూ. 3.25కోట్లు
9 రెస్టాఫ్ ఇండియా  రూ. 7.65 కోట్లు రూ. 9 కోట్లు
10 ఓవర్సీస్  రూ. 11.55 కోట్లు రూ. 9 కోట్లు
  టోటల్  రూ. 89.60 కోట్లు రూ. 106.k75 కోట్లు

Also Read: ఓటీటీలో 'భీమ్లానాయక్', రిలీజ్ ఎప్పుడంటే?

తొలి వారం 'భీమ్లా నాయక్' సినిమా సుమారు రూ. 90 కోట్లు కలెక్ట్ చేసింది. మరో 16 కోట్లు కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూట‌ర్లు పెట్టిన డబ్బులు రికవరీ అవుతాయి. ఆ తర్వాత లాభాలు వస్తాయి. థియేట్రికల్ బిజినెస్ కాకుండా శాటిలైట్, డిజిటల్ రైట్స్ పరంగా నిర్మాతకు భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయి. పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్'ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Also Read: 'బాహుబలి', 'పుష్ప' - తప్పంతా టాలీవుడ్‌దేనా? తమిళ నిర్మాత ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో?