గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న విడుదల అవుతోంది. ఈ సినిమాలో మొదటి పాట 'గణేష్ యాంథమ్'ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.   


బాలయ్యతో శ్రీ లీల ఆటాపాటా
Ganesh Anthem Promo : 'భగవంత్ కేసరి'లో మొదటి పాట 'గణేష్ యాంథమ్' ప్రోమోను రేపు (అనగా... ఆగస్టు 28, బుధవారం) విడుదల చేయనున్నారు. పూర్తి లిరికల్ వీడియో శుక్రవారం (అనగా... సెప్టెంబర్ 1న) ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ పాటలో బాలకృష్ణ, శ్రీ లీల సందడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. 


వినాయక చవితి సందర్భంగా అన్ని మండపాలలో 'భగవంత్ కేసరి' సినిమాలో గణేష్ యాంథమ్ వినబడుతుందని, అంత మంచి బాణీ తమన్ అందించారని చిత్ర బృందం పేర్కొంది.


Also Read : టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్‌ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!






'భగవంత్ కేసరి' చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ సందడి చేయనున్నారు. యువ కథానాయిక శ్రీ లీల ప్రధాన పాత్రధారి. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర అని టాక్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ చేశారు.


Also Read ప్రతి పండక్కి... ప్రతి నెలలో శ్రీ లీల సినిమా - వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు!



'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే? 
Bhagavanth Kesari Andhra Pradesh Telangana Rights : 'భగవంత్ కేసరి' నైజాం థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను 14 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సీడెడ్ (రాయలసీమ) హక్కులు రూ. 12 కోట్లు పలకగా... ఆంధ్ర ఏరియా హక్కులను సుమారు 34 కోట్ల రూపాయలకు ఇచ్చారట.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్టాల హక్కులను రూ. 60 కోట్లకు అమ్మేశారు. 'వీర సింహా రెడ్డి'తో సంక్రాంతికి బాలకృష్ణ భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 63 కోట్లు. దాంతో పోలిస్తే... 'భగవంత్ కేసరి'కి జస్ట్ మూడు కోట్లు మాత్రమే తక్కువ. ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ కూడా కలిపితే 70 కోట్లు దాటుతుంది. 


Bhagavath Kesari break even target : ఇప్పుడు 'భగవంత్ కేసరి'కి బాలకృష్ణ ముందు ఉన్న టార్గెట్ 70 కోట్ల రూపాయలు. బ్రేక్ ఈవెన్ కావాలంటే... అంత కలెక్ట్ చేయాలి. దసరా బరిలో సినిమా విడుదల అవుతుంది కనుక అంత రాబట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు. అక్టోబర్ 19 గురువారం వచ్చింది. అప్పటి నుంచి 24వ తేదీ పండగ వరకు సెలవులు ఉంటాయి కనుక మంచి వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిర్మాతలు ఆల్రెడీ లాభాల్లో ఉన్నారని సమాచారం. 'భగవంత్ కేసరి' డిజిటల్, శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా సుమారు 35 కోట్లు వచ్చినట్లు టాక్. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial