టీటీలు వచ్చిన తర్వాత మలయాళీ సినిమాలకు ఎంత డిమాండ్ పెరిగిందో తెలిసిందే. అక్కడ రిలీజయ్యే ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. మమ్మూటీ, మోహన్‌లాల్ సినిమాలతోపాటు టోవినో థామస్, బాసిల్ జోసెఫ్ సినిమాలకు కూడా ఎక్కడా లేని క్రేజ్ లభిస్తోంది. ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ నటించిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ మూవీలో భార్య చేతిలో తన్నులు తినే భర్తగా బాసిల్ జీవించాడు. 


అలాగే.. ఇటీవల విడుదలైన ‘గురువాయూర్ అంబలనందే’ సినిమాలో కూడా బాసిల్‌దే కీలక పాత్ర. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ కామెడీ మూవీలో.. కథ మొత్తం బాసిల్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో ప్రేమికుడి పాత్రలో బాసిల్‌ నటించాడు. బాసిల్‌కు పృథ్విరాజ్ చెల్లితో పెళ్లి కుదురుతుంది. అయితే, బాసిల్ తన ప్రియురాలిని మరిచిపోలేకపోతున్నానని పృథ్విరాజ్‌కు చెబుతాడు. దీంతో పృథ్విరాజ్ అతడిని ఓదార్చి పెళ్లికి ఒప్పిస్తాడు. అతడి మాజీ ప్రియురాలిని తిట్టి పోస్తాడు. చివరికి.. ఆ మాజీ ప్రియురాలు తన భార్యేనని తెలుసుకుని.. పృథ్విరాజ్ ఆ పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత కామెడీ వరదలా పారుతుంది. ఈ మూవీ మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీకి పృథ్విరాజ్ సహ నిర్మాతగా వ్యవహరించాడు. 


ఇక బాసిల్ జోసెఫ్ తాజా మూవీ విషయానికి వస్తే.. టైటిల్‌ పోస్టర్‌తోనే కితకితలు పెట్టిస్తున్నాడు. అరటిపండుపై ‘మరణమాస్’ టైటిల్‌ను డిజైన్ చేశారు. గురువారం నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో నిర్మాత టోవినా థామస్‌, బాసిల్‌తోపాటు ఇతర తారాగణం, సిబ్బంది పాల్గొన్నారు. అయితే, ఆ టైటిల్ పోస్టర్ చూసి అంతా నవ్వుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టర్స్‌పై ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. టైటిల్ పోస్టర్‌తోనే నవ్వించేస్తున్నారు కదయ్యా.. ఇక సినిమా ఎలా ఉంటుందో అని అంటున్నారు. 






‘మిన్నెల్ మురళీ’ మూవీతో దర్శకుడిగా గుర్తింపు


టోవినో థామస్ నటించిన సూపర్ హీరో మూవీ ‘మిన్నెల్ మురళి’కి బాసిల్ దర్శకుడిగా వ్యవహరించాడు. దీంతో టోవినో నిర్మాతగా మారి అతడి రుణం తీర్చుకుంటున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక బాసిల్ విషయానికి వస్తే 2013 నుంచే బాసిల్ మలయాళం సినీ ఇండస్ట్రీలో తన లక్ పరీక్షించుకోవడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ.. చిన్న చితక పాత్రలతో నటుడిగా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. 2015లో ‘కుంజిరామాయణం’ మూవీతో దర్శకుడిగా మారాడు. అయితే, దర్శకుడిగా చేసింది మూడు సినిమాలే. ప్రస్తుతం నటుడిగా చాలా బిబీగా ఉన్నాడు బాసిల్. 


‘మరణమాస్’ మూవీతో శివ ప్రసాద్ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. కోచీలోని అంచుమాన ఆలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. వరల్డ్ వైడ్ ఫిల్మ్స్‌తో కలిసి టోవినో థామస్ బ్యానర్ కింద ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఇంకా రాజేష్ మాధవన్, సిజు సన్నీ, సురేష్ కృష్ణ, బాబు ఆంటోని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిజు సన్నీ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. 


Also Read: 'కల్కి' సినిమాకు సంగీతం అందించిన కీరవాణి, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే?