గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చేస్తున్న ఆయన... రెండు కొత్త సినిమాలు అంగీకరించారు. ఆ రెండు కాకుండా మరొక రెండు సినిమాలు లైన్‌లో ఉన్నట్లు తెలిసింది.

'మార్కో' దర్శకుడితో బాలయ్య సినిమా?అనుష్క 'భాగమతి', ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలలో కీలక పాత్రలు పోషించిన మలయాళ కథానాయకుడు ఉన్ని ముకుందన్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో'తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ సినిమాకు మహమ్మద్ హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు, అది కూడా బాలకృష్ణ సినిమాతో అని ఫిలిం నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

'మార్కో' విజయం తర్వాత మహమ్మద్ హనీఫ్ (Haneef Adeni)తో సినిమాలు తీసేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపించారు. 'దిల్' రాజు ఆయనకు అడ్వాన్స్ ఇచ్చారు కూడా! మహమ్మద్ హనీఫ్ సైతం తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. బాలకృష్ణకు ఆయన ఒక కథ చెప్పారని, వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

Also Read: సెలూన్ ఓపెనింగ్‌కు పవన్ కళ్యాణ్... అదీ జాగింగ్ డ్రస్‌లో... ఎందుకు వెళ్లారో తెలుసా?

'మార్కో'లో యాక్షన్ పట్ల కొంతమంది నుంచి విమర్శలు వ్యక్తం అయినా మెజారిటీ ప్రేక్షకులు ఆ సినిమాకు క్లాప్స్ కొట్టారు. దాంతో బాక్సాఫీస్ బరిలో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో బాలకృష్ణకు ఉన్న యాక్షన్ ఇమేజ్ గురించి తెలిసిందే. వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే? అందులో యాక్షన్ ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి. బాలకృష్ణ, మహమ్మద్ హనీఫ్ కాంబినేషన్‌లో రూపొందే సినిమాను 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేస్తారా? లేదంటే మరొక నిర్మాత ఎవరైనా చేస్తారా? అనేది చూడాలి. 

'అఖండ 2' తర్వాత ఆ రెండూ...బాలకృష్ణతో హనీఫ్ సినిమా NBK112?Balakrishna Upcoming Movies: 'అఖండ 2' తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'జైలర్ 2'లో బాలకృష్ణ కనిపించనున్న సంగతి తెలిసిందే. అతిథి పాత్ర కంటే కాస్త ఎక్కువ నడివి ఉన్న క్యారెక్టర్‌లో ఆయన సందడి చేయనున్నారు. ఆ తర్వాత 'వీర సింహా రెడ్డి' వంటి విజయవంతమైన సినిమా తీసిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. బాలకృష్ణ పుట్టిన రోజుకు ముందు ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అది NBK111 అని పేర్కొన్నారు. ఆ సినిమా తర్వాత 'మార్కో' ఫేమ్ హనీఫ్ అదేనీ సినిమా ఉంటుందేమో!?

అజిత్ 'గుడ్ బడ్ అగ్లీ' దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ సైతం బాలకృష్ణతో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అతడిని బాలకృష్ణ దగ్గరకు తీసుకువెళ్లి కథ చెప్పించారట.

Also Readబ్రాహ్మణులు వర్సెస్ మంచు ఫ్యామిలీ - గొడవ ఎప్పుడు మొదలైంది? 'కన్నప్ప' కాంట్రవర్సీ ఏమిటి? డిటైల్డ్ స్టోరీ