Maruthi About Prabhas The Raja Saab Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తోన్న అవెయిటెడ్ మూవీ 'ది రాజాసాబ్'. రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా రానున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్లుగానే ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు మారుతి.
వన్ పర్సెంట్ ఎక్కువే..
డార్లింగ్ ఫ్యాన్స్ ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంతకు మించే ఈ మూవీ ఉంటుందని మారుతి తాజాగా ఓ ఈవెంట్‌లో తెలిపారు. 'ఈ మూవీ గురించి ఇప్పటివరకూ ఎక్కడా మాట్లాడలేదు. నేను కాదు నా పని మాట్లాడాలని భావించా. మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో దానికి మించి వన్ పర్సెంట్ ఎక్కువే ఇస్తాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఆయన చూపించిన ప్రేమను నేను చూశాను. ఆయనపై నాకున్న లవ్‌ను మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ నెల 16న టీజర్ లాంచ్ చేస్తున్నాం. రాజులకే రాజు ప్రభాస్ రాజు.' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఈ నెల 16న టీజర్
ఈ మూవీ అప్‌డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నారు. కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ ఇటీవలే టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు డైరెక్టర్ మారుతి. ఈ నెల 16న టీజర్ రిలీజ్ కానుండగా.. ప్రభాస్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని డిఫరెంట్ రోల్‌లో చూడబోతున్నారంటూ అమాంతం హైప్ క్రియేట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ అలాగే ఇంట్రెస్ట్ పెంచాయి. కాస్త లేట్ అయినా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా మారుతి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ డైలాగ్ మాటేంటి..
ఈ మూవీలో ప్రభాస్ లుక్ చూసిన ఎవరైన నెవర్ భిపోర్ అనేలానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న డైలాగ్‌ను ప్రభాస్ నోటి నుంచి టీజర్‌లో వినిపించబోతున్నారనే సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. హారర్‌తో పాటు ఓ విజువల్ ట్రీట్ ఇచ్చేలా పెద్ద ప్లానే వేశారు మారుతి. ప్రభాస్ స్టైల్‌కు థ్రిల్ కలగలిపి మొత్తానికి టీజర్‌ను విజువల్ వండర్‌గా రిలీజ్ చేయబోతున్నారని మారుతి కామెంట్స్ బట్టి అర్థమవుతోంది. మరి అది ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఈ నెల 16 వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధికుమార్, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే నాలుగు సాంగ్స్ పూర్తయ్యాయి. మారుతి ప్రభాస్ కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ అంచనాలను మించి ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.