Balakrishna's Akhanda 2 Movie Update: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'అఖండ 2'. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన 'అఖండ'కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ టీం బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీ టీజర్‌పై తాజాగా మూవీ టీం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలిపింది. ఈ నెల 9న సాయంత్రం 06:03 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'దైవిక ఉగ్రత కోసం సిద్ధంగా ఉండండి' అంటూ రాసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే టీజర్ మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: బ్రాహ్మణులు వర్సెస్ మంచు ఫ్యామిలీ - గొడవ ఎప్పుడు మొదలైంది? 'కన్నప్ప' కాంట్రవర్సీ ఏమిటి? డిటైల్డ్ స్టోరీ

ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు బోయపాటి శ్రీను. '14 రీల్స్ ప్లస్' బ్యానర్‌పై ఎం.తేజస్విని సమర్పణలో రామ్ అంచట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ టీజర్ కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు బాలయ్య  బర్త్ డేకు ఒక రోజు ముందు టీజర్ రిలీజ్ కానుంది. 'దసరా' సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకున్నాయి. డివోషనల్ అంశాలతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'అఖండ'లో బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించారు. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు సీక్వెల్‌లోనూ అంతే రేంజ్‌లో మాస్, డివోషనల్‌ను ముడిపెడుతూ బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ అందించేలా మూవీని తెరకెక్కిస్తున్నారు బోయపాటి. మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిమాలయాల్లో కీలక సీన్స్ చిత్రీకరణ పూర్తైంది.

ప్రస్తుతం జార్జియాలో..

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జార్జియాలో సాగుతోంది. బాలకృష్ణతో పాటు ముఖ్య నటీనటులపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ బీజీఎం మూవీకి హైలెట్‌గా నిలవనుంది. మరోసారి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలోనూ బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టీజర్ రిలీజ్‌కు సంబంధించి పనులు చకచకా సాగుతున్నాయి.