Pawan Kalyan Shooting Part Complete In OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది గుడ్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా పాలనలో బిజీగా మారిన పవన్ తాను కమిట్ అయిన మూవీస్‌ను త్వరితగతిన కంప్లీట్ చేస్తున్నారు. ఆయన మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఒకటైన 'ఓజీ' షూటింగ్ ఇటీవలే మొదలు కాగా.. తాజాగా పవన్ షూటింగ్ పార్ట్ పూర్తైంది.
ఇక రిలీజ్‌కు రెడీ
ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. ఆయన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ''గంభీర' కోసం ప్యాకప్.. రిలీజ్‌కు సిద్ధం' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య 'ఓజీ' మూవీని నిర్మిస్తుండగా.. ముంబయి మాఫియా నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.పవన్ సరసన ప్రియాంక్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నెగిటివ్ రోల్ చేస్తుండగా.. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, గ్లింప్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి.
పవన్ మూవీ కోసం వెయిటింగ్
ఈ మూవీలో పవన్ డిఫరెంట్ రోల్‌లో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ 'గంభీర'గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. 'వాడు నరికిన మనుషుల రక్తాన్ని.. ఇప్పటికీ ఏ తుపాను కడగలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగొస్తున్నాడంటే..' అంటూ సాగే డైలాగ్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. సినిమాలో పవర్ స్టార్ పవర్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
'భీమ్లా నాయక్' మూవీ తర్వాత ఇప్పటివరకూ పవర్ స్టార్ మూవీ రాలేదు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పవన్ బిజీగా మారడం.. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు, ప్రజా పాలనలో తీరిక లేకుండా గడపడంతో ఆయన ప్రాజెక్టులు ఆగిపోయాయి. కాస్త టైం దొరికిన టైంలోనే తాను కమిట్ అయిన మూవీస్ పూర్తి చేయాలని భావించిన ఆయన అందుకు అనుగుణంగానే.. హరిహర వీరమల్లు, ఓజీ షూటింగ్స్ కంప్లీట్ చేశారు. 'హరిహర' డబ్బింగ్ కూడా అవిశ్రాంతంగా నాలుగు గంటల్లోనే పూర్తి చేశారు.
'హరిహర వీరమల్లు' ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించినప్పటికీ అది వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌తో పాటే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్‌లోనూ పవన్ త్వరలోనే పాల్గొననున్నారు.