Balakrishna's Aditya 369 Movie Re Release Date Unvieled: 'గాడ్ ఆఫ్ మాసెస్' బాలకృష్ణ (Balakrishna) హీరోగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన ఒకప్పటి సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీ 'ఆదిత్య 369' (Aditya 369). ఈ మూవీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 


ఏప్రిల్ 11న గ్రాండ్ రీ రిలీజ్


టైమ్ ట్రావెల్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీని ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా డిజిటలైజ్ చేసి ఏప్రిల్ 11న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలు సమర్పణలో శ్రీదేవీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 1991లో విడుదలైన ఈ చిత్రాన్ని శివలెంక ప్రసాద్ నిర్మించారు. ఇళయరాజా మ్యూజిక్, జంధ్యాల డైలాగ్స్, ఎస్పీ బాలు గాత్రం, సింగీతం దర్శక నైపుణ్యం అన్నీ కలగలిపి ఈ చిత్రం సినీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఐకానిక్ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది.


Also Read: అమ్మాయిల్లో నాకు నచ్చేది అదే - రామ్‌గోపాల్‌వర్మ మరీ అంత ఓపెన్‌గా చెప్పేశారేంటీ..!


6 నెలల పాటు శ్రమించి..


ఈ చిత్రాన్ని ప్రసాద్స్ డిజిటల్ టీం 6 నెలలు పాటు శ్రమించి మంచి అవుట్ పుట్ ఇచ్చారని శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్  చెప్పారు. 'ఈ చిత్రాన్ని 4kలో డిజిటలైజ్ చేశాం. సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి కన్వర్ట్ చేశాం. రీ రిలీజ్ ప్రకటన రాగానే ఎంతో మంది విడుదల తేదీ కోసం ఆసక్తిగా చూశారు. అప్పట్లో ఇది చాలా అడ్వాన్స్ సినిమా. ఇప్పటి ట్రెండ్‌కు కనెక్ట్ అయ్యే సినిమా. ఈ మూవీ నిర్మించేందుకు నాకు సహకరించిన ఎస్పీ బాలు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అప్పట్లో కొత్త నిర్మాతనైనా నన్ను నమ్మి ఈ సినిమా ఛాన్స్ ఇచ్చిన బాలకృష్ణకు కృతజ్ఞతలు.






నందమూరి అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు ఇదొక గొప్ప కానుక.‌ ఇప్పటి వరకు నిర్మాతగా 15 సినిమాలు చేశాను. ఎన్ని హిట్ సినిమాలు తీసినా సరే... నాకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒక గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చిన సినిమా ‘ఆదిత్య 369’. మా సంస్థ శ్రీదేవి మూవీస్ పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసిన చిత్రం ఇది. వరుస విజయాలతో ఈ జనరేషన్‌ ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తున్న బాలయ్య బాబు ప్రభంజనానికి ‘ఆదిత్య 369’ ఒక తీయటి కొనసాగింపుగా నిలుస్తుంది.' అని అన్నారు.


త్వరలోనే సీక్వెల్ కూడా..


మరోవైపు, ఈ మూవీకి సీక్వెల్ సైతం అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని 'అన్‌స్టాపబుల్ విత్ NBK'లో బాలకృష్ణ ప్రకటించారు. ఇందులో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి 'ఆదిత్య 999 మ్యాక్స్' టైటిల్ ఖరారు చేసినట్లు చెప్పారు.