Ram Gopal Varma Sensational Comments About Girls: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి అమ్మాయిలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రత్యూష అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తాజాగా ఆయన్ను కలిసి ఫోటో దిగారు. ఈ సందర్భంగా అమ్మాయిల్లో మీకు నచ్చిందేంటి.? అని అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చారు.

'అమ్మాయిల్లో నాకు నచ్చింది అదే'

'సార్ మీరు ఎంతోమంది అమ్మాయిలను చూసుంటారు. వారిలో మీకు నచ్చేది ఏంటి.?' అనే ప్రశ్నకు.. 'అంటే మీరు మంచిగా తీసుకుంటారనే చెప్తున్నాను. నిజం చెప్పాలంటే అమ్మాయిల్లో నాకు నచ్చే.. నాకు చాలా ఇష్టమైనది B*******' అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సదరు వీడియో తీసే వ్యక్తి 'జస్ట్ లైక్ మీ' అంటూ కామెంట్ చేయడం వీడియోలో వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ప్రత్యూష' అనే అమ్మాయి ఇన్ స్టా పేజ్‌లో ఇది షేర్ చేయగా.. అందులో ఆమె తాను నటిగా పేర్కొన్నారు.

అయితే, గతంలోనూ వర్మ అమ్మాయిలపై సెన్సేషనల్ కామెంట్స్ చాలానే చేశారు. అమ్మాయిల ఫోటోలు, కొన్ని వీడియోలు షేర్ చేయడం పలు వివాదాలు, విమర్శలకు కారణమైంది. తన ఇన్ స్టా ఖాతాలో గతంలోనూ ఓ అమ్మాయి ఫోటో షేర్ చేసి.. 'ఆమె అందానికి ఫిదా అయ్యానంటూ ఆమె ఎవరో తెలిస్తే చెప్పండి' అంటూ రిక్వెస్ట్ చేయగా నెటిజన్లు డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యారు. మరో వీడియోలో ఓ అమ్మాయితో అఫైర్ గురించి మాట్లాడడం, శృంగారం తర్వాత ఆ అమ్మాయి ప్రవర్తించిన విధానం గురించి కామెంట్స్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు మరోసారి అమ్మాయిల్లో తనకు నచ్చింది అదేనంటూ చెప్పడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: అల్లరి నరేష్ భయపెట్టేశాడుగా.. - '12A రైల్వే కాలనీ' టీజర్ చూశారా..?, పొలిమేర దర్శకుడి నుంచి ఈ సమ్మర్‌కు మరో హారర్ థ్రిల్లర్

వివాదాలతో వార్తల్లోకి..

ఒకప్పుడు స్టార్ హీరోలతో మంచి హిట్స్ అందించిన వర్మ ఆ తర్వాత వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తనకు నచ్చని పొలిటికల్ లీడర్స్‌ను సోషల్ మీడియా వేదికగా విమర్శించడమే కాకుండా.. వారిపై తనదైన మార్క్ సినిమాలతో సైతం సెటైర్లు వేసేవారు. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో పోస్టులు చేయడం.. 'వ్యూహం' వంటి సినిమాలతో ఓ పొలిటికల్ పార్టీని తక్కువ చేసేలా చూపించడం వంటివి సంచలనంగా మారింది. ఆయన ఏం చేసినా సంచలనమే.

తాజాగా, వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో చేసిన పోస్టులు, బహిరంగ విమర్శలపై ఫిర్యాదులు అందడంతో ఏపీ పోలీసులు ఆయనపై కేసులు సైతం నమోదు చేశారు. సీఐడీ అధికారులు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' మూవీపై సీఐడీ నోటీసులపై స్టే ఇవ్వాలంటూ ఆర్జీవీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ మూవీలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వివాదాస్పద సీన్లు చిత్రీకరించారని అప్పట్లోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్జీవీ.. వైసీపీ హయాంలో చేసిన కామెంట్స్‌, పెట్టిన పోస్టులపై పోలీసులు చర్యలకు చేపట్టారు.