Allari Naresh's '12A Railway Colony' Movie Teaser Unvieled: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ (Allari Naresh) ప్రస్తుతం క్రేజీ అండ్ యూనిక్ ప్రాజెక్ట్స్‌తో అలరిస్తున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ '12A రైల్వే కాలనీ' (12A Railway Colony) ఈ సమ్మర్‌కు రిలీజ్ కానుంది. హారర్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న మూవీతో నరేష్ భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
నరేష్ భయపెట్టేశారుగా..
పొలిమేర, పొలిమేర 2 సినిమాల దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. దెయ్యాలు, ఆత్మలు కనిపించే వ్యక్తిగా అల్లరి నరేష్ కనిపించనున్నట్లు మూవీ టీజర్‌ను బట్టి తెలుస్తోంది. '12A రైల్వే కాలనీ' అనే టైటిల్ మూవీపై హైప్ పెంచేయగా.. టీజర్ సినిమా కథను గ్లింప్స్‌లా ప్రజెంట్ చేసింది. అల్లరి నరేష్ కిటికీ దగ్గర నిలబడి, ఆలోచనలో, ధ్యాన ముద్రలో కనిపించడంతో టీజర్ బిగెన్ అవుతుంది. 'ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్నా..' అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'ఈ స్పిరిట్స్, ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయ్.. అందరికీ ఎందుకు కనిపించవ్..' అంటూ వైవా హర్ష వాయిస్ ఓవర్‌లో వచ్చే డైలాగ్ మరింత ఆసక్తి రేపుతోంది.
అల్లరి నరేష్ మరోసారి డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తుండగా.. పొలిమేర ఫేం డాక్టర్ కామాక్షి భాస్కర్ల కీలక పాత్ర పోషించారు. అలాగే సీనియర్ నటుడు సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
పొలిమేర దర్శకుడిగా..
పొలిమేర, పొలిమేర 2 హారర్ థ్రిల్లర్స్ ఎంత మంచి విజయం సాధించాయో తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా.. దానికి సీక్వెల్‌గా వచ్చిన పొలిమేర 2 థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అనిల్ విశ్వనాథ్ ఈ మూవీకి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి దెయ్యం బ్యాక్ డ్రాప్, డిఫరెంట్ టైటిల్‌తో వస్తోన్న హారర్ థ్రిల్లర్‌తో ఆడియన్స్‌ను భయపెట్టేందుకు వస్తున్నారు.
మరోవైపు, ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా కథలను ఎంచుకుంటూ డిఫరెంట్ రోల్స్‌లో మెప్పిస్తున్నారు అల్లరి నరేష్. ఆయన రీసెంట్ మూవీ బచ్చలమల్లి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అంతకుముందు నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఆ ఒక్కటి అడక్కు సినిమాలతో అలరించారు. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ కథాంశంతో అందరినీ భయపెట్టేలా మరో కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ఈ సినిమా ఈ సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.