గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). ఇందులో ఆయనకు జోడీగా తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శ్రీ లీల ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ చేస్తున్నారు. 


క్లైమాక్స్ షూటింగులో...
Bhagavanth Kesari Climax Shoot : ప్రస్తుతం బాలకృష్ణ, శ్రీ లీల, ఇంకా కొందరు నటీనటులు పాల్గొనగా... 'భగవంత్ కేసరి' పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. జూలై 5 వరకు ఈ షెడ్యూల్ కంటిన్యూ అవుతుందని తెలిసింది. ఆ తర్వాత చిన్న బ్రేక్ ఇవ్వనున్నారు. 


అమెరికా వెళుతున్న బాలకృష్ణ! 
జూలై 5న బాలకృష్ణ అమెరికా వెళుతున్నట్లు తెలిసింది. తానా (Telugu Association of North America) నుంచి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. అమెరికాలో తెలుగు ప్రజలను కలవడానికి, ఆ సభల్లో పాల్గొనడానికి జూలై 5న బాలయ్య బయలు దేరుతున్నారు. శ్రీ లీల కూడా ఆ సభల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ 'భగవంత్ కేసరి' షూటింగ్ స్టార్ట్ చేస్తారు.


Also Read : 'సామజవరగమన' రివ్యూ : కామెడీతో కొట్టిన శ్రీ విష్ణు... సినిమా ఎలా ఉందంటే?


Palak Lalwani In Bhagavath Kesari : 'అబ్బాయితో అమ్మాయి' సినిమాలో నాగశౌర్య జోడీగా నటించిన అమ్మాయి గుర్తు ఉన్నారా? ఆ తర్వాత 'జువ్వ' సినిమాలో కూడా కథానాయికగా నటించారు. ఆమె పేరు పాలక్ లల్వానీ! 'భగవంత్ కేసరి'లో ఈ నార్త్ ఇండియన్ అమ్మాయి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతానికి ఆమె పాత్ర ఏమిటి? తెరపై ఎంత సేపు కనపడతారు? అనేది సస్పెన్స్!


Also Read : ట్విట్టర్ అంకుల్స్‌కు ఇచ్చిపడేసిన తమన్నా - పెళ్ళికి ముందు శృంగారంపై షాకింగ్ కామెంట్స్


అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ నందమూరి అభిమానులను, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక, 'నరసింహ నాయుడు' సినిమాలోని 'చిలకపచ్చ కొక...' పాటకు కాజల్ అగర్వాల్, శ్రీ లీల వేసిన స్టెప్పులు సినిమాలో సాంగ్ మీద అంచనాలు మరింత పెంచాయి. 


నెలకొండ భగవంత్ కేసరిగా ఎన్‌బికె
ఎన్‌బికె (NBK)... నందమూరి బాలకృష్ణ... ఇదీ నటసింహం పేరు. సినిమాలో కూడా ఆయన పేరు ఎన్‌బికె. అంటే... నెలకొండ భగవంత్ కేసరి. టీజర్ చూస్తే ఎన్‌బికె ఊచకోత ఎలా ఉంటుందో ఈజీగా అర్థం అవుతుంది. బియాండ్ యువర్ ఇమాజినేషన్... ప్రేక్షకుల ఊహలకు అందని రీతిలో 'భగవంత్ కేసరి' సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా అనిల్ రావిపూడి చెప్పారు.


'రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు' అని బాలకృష్ణ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. ఆ తర్వాత బాలకృష్ణ మార్క్ ఫైట్, గ్రాండ్ సింగ్ విజువల్స్ కూడా చూపించారు. అడవి బిడ్డగా బాలకృష్ణ కనిపించనున్నారు. 'ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటాది' అని చివర్లో వచ్చే డైలాగ్, ఆ తర్వాత బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్లడం హైలైట్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial