Udhayanidhi Stalin: మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మామన్నన్’. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, వడివేలుతో పాటు ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘పరియేరుమ్ పెరుమాళ్’, ‘కర్ణన్’ చిత్రాల తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తోంది మూవీ ఇది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ ఉంది మూవీ టీమ్. ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ హీరో గా ఇదే తన చివరి చిత్రం అని చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ కోసం జరిగిన కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


అప్పుడు సూర్య చెప్తే నాకు తెలియలేదు, ఇప్పుడు అర్థమవుతుంది: ఉదయనిధి


ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం ‘మామన్నన్’ సినిమా ప్రమోషన్స్ లో తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రయివేటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాను అనుకోకుండా సినిమాల్లోకి తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. 2010 లో తనను సినిమాల్లో నటిస్తావా అని అడిగితే చేయను అని చెప్పానని అన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు నటించావు అని ఎవరూ అడగొద్దని, పరిస్థితులు మారతాయి అని చెప్పుకొచ్చారు. మనం నిత్యం కలిసే వ్యక్తుల వల్ల కూడా మన నిర్ణయాలు మారుతూ ఉంటాయని చెప్పారు. అలాగే 2017 లో తనను రాజకీయాల్లో చేరతావా అని అడిగితే చేరను అని చెప్పానని, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యానని చెప్పుకొచ్చారు ఉదయనిధి.


అలాగే తనకు రాజకీయ అవగాహన కూడా మొదట్లో ఉండేది కాదని, ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నానని చెప్పారు. 2011లో ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో 'ఏజ్యం వీడు' అనే చిత్రాన్ని నిర్మించానని, అందులో హీరోగా సూర్య నటించాడని చెప్పారు. అయితే ఆ సినిమాలో రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా ఒక డైలాగ్ ఉందని అన్నారు. వాస్తవానికి ఆ సీన్ లో సూర్య లేడని అన్నారు. కానీ షూటింగ్ పూర్తి అయ్యాక సూర్య తనకు ఫోన్ చేసి ఆ డైలాగ్ తీసేయాలని కోరాడన్నారు. అప్పుడు నేను ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదని, ఆ అవగాహన సూర్యకు అప్పటినుంచే ఉందని చెప్పాడు.


తనకు అప్పట్లో రిజర్వేషన్లపై అంతగా అవగాహన లేదని, ఇప్పుడు ఆ విషయం తలుచుకుంటే చాలా పెద్ద మిస్టేక్ చేశానని అనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉదయనిధి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ‘మామన్నన్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 29న రీలీజ్ కానుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సూర్య సినిమాల విషయానికొస్తే.. సూర్య ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ ఫాంటసీ అడ్వెంచర్ 'కంగువ' షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా దిశా పటాని నటిస్తోంది. దీని తర్వాత వెట్రిమారన్ 'వాడివాసల్' తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ చిత్రంలో నటించనున్నారు సూర్య.


Also Read: ట్విట్టర్ అంకుల్స్‌కు ఇచ్చిపడేసిన తమన్నా - పెళ్ళికి ముందు శృంగారంపై షాకింగ్ కామెంట్స్