ప్రభాస్ 'సాహో', రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమాల్లో కీలక పాత్రలో నటించిన తమిళ హీరో అరుణ్ విజయ్ (Arun Vijay) గుర్తున్నారా? ఆయన నటుడు విజయ్ కుమార్ తనయుడు. తమిళంలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఈ నెలలో తమిళ అనువాద సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.


అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ నటించిన తమిళ సినిమా 'యానై'. తెలుగులో 'ఏనుగు' (Telugu Movie Enugu) పేరుతో అనువదిస్తున్నారు. విఘ్నేశ్వర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.హెచ్. సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. గతంలో ఆయన ధనుష్ 'ధర్మయోగి', 'బూమరాంగ్', 'లోకల్ బాయ్స్' సినిమాలను తెలుగులో విడుదల చేశారు. 


జూన్ 17న 'ఏనుగు' సినిమాను విడుదల చేయనున్నట్టు సి.హెచ్. సతీష్ కుమార్ తెలిపారు. ఈ నెల 12న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. హీరో సూర్య 'సింగం' సిరీస్, విశాల్ 'పూజ' యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ తీసిన హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


Also Read: 'అంటే సుందరానికీ' రివ్యూ: కామెడీలో సిక్సర్ - మరి కథ? నాని, నజ్రియా సినిమా ఎలా ఉందంటే?


సముద్రఖని, 'కెజియఫ్' ఫేమ్ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి వంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.


Also Read: 'కిన్నెరసాని' రివ్యూ: కళ్యాణ్ దేవ్ అండ్ టీమ్ స‌ర్‌ప్రైజ్‌ చేసింది, ఈ సినిమా ఎలా ఉందంటే?