ముంబై ఉగ్రదాడిలో సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలను అర్పించిన అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 'మేజర్'. అడివి శేష్ టైటిల్ రోల్ పోషించారు. ఈ నెల 3న సినిమా విడుదలైంది. నిన్నటికి సినిమా విడుదలై వారం అయ్యింది.
 
ప్రపంచవ్యాప్తంగా తొలి వారం 'మేజర్' సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? ఏ ఏరియాలో ఎంత వసూళ్లు వచ్చాయో తెలుసా? ట్రేడ్ వర్గాల ప్రకారం... ఏడు రోజుల్లో నిర్మాతలకు ఎన్ని కోట్లు వచ్చాయి?


ప్రపంచవ్యాప్తంగా 'మేజర్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్:
నైజాం -  రూ. 6.97 కోట్లు
సీడెడ్ - రూ. 1.64 కోట్లు
నెల్లూరు - రూ. 60 లక్షలు
గుంటూరు - రూ. 98 లక్షలు
కృష్ణా జిల్లా  - రూ. 92 లక్షలు
తూర్పు గోదావ‌రి - రూ. 1.23 కోట్లు
పశ్చిమ గోదావ‌రి - రూ. 79 లక్షలు
ఉత్తరాంధ్ర - రూ. 1.82 కోట్లు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాల్లో: రూ.14.95 కోట్లు (ఇది షేర్ కలెక్షన్స్. గ్రాస్ పాతిక కోట్లు అని సమాచారం)


కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా - రూ. 1.65 కోట్లు
హిందీ, ఇతర భాషలు - రూ. 3.50 కోట్లు 
ఓవ‌ర్ సీస్ - రూ. 5.50 కోట్లు


ప్రపంచవ్యాప్తంగా 'మేజర్' ఫస్ట్ వీక్ వసూళ్లు: రూ. 25.60 కోట్లు (ఇవి షేర్ కలెక్షన్స్. గ్రాస్ కలెక్షన్స్ సుమారు రూ. 46.65 కోట్లు అని సమాచారం)


Also Read: 'అంటే సుందరానికీ' రివ్యూ: కామెడీలో సిక్సర్ - మరి కథ? నాని, నజ్రియా సినిమా ఎలా ఉందంటే?


అడివి శేష్ జంటగా సయీ మంజ్రేకర్, ప్రధాన పాత్రలో శోభితా ధూళిపాళ్ల, హీరో తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతి నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. మహేష్ బాబు, నమ్రత, అనురాగ్, శరత్ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.


Also Read: 'కిన్నెరసాని' రివ్యూ: కళ్యాణ్ దేవ్ అండ్ టీమ్ స‌ర్‌ప్రైజ్‌ చేసింది, ఈ సినిమా ఎలా ఉందంటే?