'మున్నాభాయ్ ఎంబీబీఎస్' (2003) - ఈ సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది. అయితే, ఇప్పటికీ ఆ సినిమా చూసే వాళ్ళు ఉన్నారు. కల్ట్ క్లాసిక్ హిట్ అది. దానికి సీక్వెల్‌గా వచ్చిన 'లగే రహో మున్నాభాయ్' సినిమా కూడా మంచి విజయం సాధించింది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు కొత్త ఇమేజ్ తీసుకు వచ్చింది. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీని అతడికి దగ్గర చేసింది. 'సంజు' బయోపిక్ తీసేలా చేసింది.


సంజయ్ దత్ కెరీర్‌లో మరువలేని సినిమా 'మున్నాభాయ్'. అతడు వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు విజయం అందించింది. 'లగే రహో మున్నాభాయ్' (2006) సినిమా తర్వాత దానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు. 'మున్నాభాయ్ చలే అమెరికా' అంటూ టైటిల్ కూడా చెప్పారు. అప్పటి నుంచి ఆ సినిమా కోసం మున్నాభాయ్ సిరీస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ సినిమా తీసే ఉద్దేశం దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీకి ఉన్నట్టు లేదు.


'మున్నాభాయ్'లో సర్క్యూట్ పాత్ర చేసిన అర్షద్ వార్సీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ''నాకు 'మున్నాభాయ్ ఎంబీబీఎస్'కు ముందు మూడు నాలుగేళ్లు సినిమాలు లేవు. ఆ సినిమా నా కెరీర్‌కు మళ్ళీ ప్రాణం పోసింది. మున్నాభాయ్ సిరీస్‌లో మళ్ళీ సినిమా ఎప్పుడు వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం 16 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాం. నిజాయితీగా చెప్పాలంటే... మున్నాభాయ్‌లో మూడో పార్ట్ రాదు'' అని చెప్పారు. అదీ సంగతి!


Also Read: మహేష్ బాబు 60 కోట్లు, త్రివిక్రమ్‌కు 50 కోట్లు - నిర్మాతకు 100 కోట్ల లాభం!?


ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా 'డంకి' సినిమా చేస్తున్నారు రాజ్ కుమార్ హిరాణీ. ఆ తర్వాత కూడా ఆయనకు క‌మిట్‌మెంట్స్‌ ఉన్నాయి. సో... ఇప్పట్లో 'మున్నాభాయ్ చలే అమెరికా' ఉండకపోవచ్చు.


Also Read: 'సుడిగాలి' సుధీర్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన రష్మీ, ఇద్దరూ అనుకుని చేశారా?