వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలతో పాటు 'ఎఫ్3'లో కొన్ని కొత్త క్యారెక్టర్లు కనిపించాయి. పూజాహెగ్డే ఐటెం సాంగ్ కూడా చేసింది. మే 27న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సత్తా చాటుతోంది. 


ఓవర్సీస్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. దీంతో చిత్రబృందం సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా యూనిట్ మొత్తం ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. అందరూ తమ స్పీచ్ లతో ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్ కి నటుడు రాజేంద్ర ప్రసాద్ కు ఎటెండ్ అయ్యారు. ఈ మీట్ లో.. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలను వినిపించారు. 'సినిమా హిట్ అవ్వకపోతే మీ ఎవరికీ నా మొహం ఎవరికీ చూపించనని' అన్నారు రాజేంద్రప్రసాద్. 


ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా.. రాజేంద్రప్రసాద్ ను స్టేజ్ పైకి పిలిచింది యాంకర్ మంజూష. అతడు మొహానికి మాస్క్ పెట్టుకొని ఉండడంతో.. యాంకర్ మంజూష 'సార్ మాస్క్ తీసేయండి' అని చెప్పింది. దీంతో రాజేంద్రప్రసాద్ అసహనానికి గురయ్యాడు. 'ఉండవమ్మా.. నీ గోల.. ఇక్కడ మా గోలే ఎక్కువైందంటే.. మధ్యలో నీ గోల ఏంటి..?' అని అనడంతో యాంకర్ మంజూష పక్కకు వెళ్లిపోయింది. అయితే తాను అలా మాస్క్ వేసుకొని రావడం వెనుకున్న కారణాన్ని చెప్పారు. సినిమా హిట్ అవ్వకపోతే తన మొహాన్ని ఎవరికీ చూపించనని అన్నానని.. కానీ ఇప్పుడు చూపిస్తున్నానంటూ మాస్క్ తీశారు. సోమవారం కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయంటే సినిమా హిట్ కాకపోతే ఇంకేంటి..? అని అన్నారు. 


Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసిన త్రివిక్రమ్ అండ్ కో


Also Read: 'సుడిగాలి' సుధీర్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన రష్మీ, ఇద్దరూ అనుకుని చేశారా?