మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చి బాబు (Buchi Babu Sana) దర్శకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. ఆ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించనున్నారు. ఆయన్ను ఖరారు చేశారని ప్రచారం బలంగా జరుగుతోంది. ఆ విషయాన్ని ఆయన ముందు ఉంచితే...
అవును... చర్చలు జరుగుతున్నాయ్!
రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమాకు మీరు సంగీతం అందిస్తున్నారని కొన్ని రోజులుగా వింటున్నాం. నిజమేనా సార్? అని అడిగితే... ''అవును, మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడే ఏమీ చెప్పలేను'' అని ఏఆర్ రెహమాన్ సమాధానం ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ జంటగా... వడివేలు, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ సినిమా 'మామన్నన్'. తెలుగులో 'నాయకుడు' పేరుతో జూలై 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ముచ్చటించినప్పుడు ఆయన పై సమాధానం ఇచ్చారు. అదీ సంగతి!
క్లింకార జన్మించడానికి కొన్ని రోజుల ముందు నుంచి రామ్ చరణ్ షూటింగులకు బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ఈ మంగళవారం నుంచి 'గేమ్ ఛేంజర్' షూటింగ్ స్టార్ట్ చేశారు. అది పూర్తి అయ్యాక సానా బుచ్చి బాబు సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళతారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, నర్తన్ దర్శకత్వంలో సినిమాలు చేసే అవకాశం ఉంది.
Also Read : నితిన్ కు హ్యాండ్ ఇచ్చిన రష్మిక - కొత్త హీరోయిన్ వేటలో వెంకీ
సతీష్ కిలారు నిర్మాణంలో...
రామ్ చరణ్ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్ కిలారు (Satish Kilaru) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
సాధారణంగా సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. అంతే కాదు... ఆయన శిష్యుల సినిమాలకూ దేవి సంగీతం అందిస్తూ వస్తున్నారు. అంత ఎందుకు? 'ఉప్పెన' సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. పాన్ ఇండియా అనుకున్నారో? కథకు రెహమాన్ అయితే బావుందని భావించారో? ఆయన్ను సంప్రదించారు బుచ్చిబాబు.
సెప్టెంబర్ నుంచి షూటింగ్ షురూ!
ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతుందని రామ్ చరణ్ గతంలో తెలిపారు. ఇందులో తనది పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అన్నారు. 'రంగస్థలం' కంటే బెటర్ సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్ అని ఇండియా కాన్‌క్లేవ్‌లో రామ్ చరణ్ తెలిపారు.
Also Read : బాబోయ్, 'ప్రేమ్ కుమార్ కథ'ను గుర్తు పెట్టుకోవడం కష్టమే - ట్విస్టులే ట్విస్టులు!
నటుడిగా రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'రంగస్థలం' సినిమాలో చిత్తుబాబు క్యారెక్టర్ ముందు వరుసలో ఉంటుంది. దాని కంటే బెటర్ క్యారెక్టర్ అని చెప్పడంతో... ఆ ఒక్క మాటతో సినిమాపై మరింత హైప్ పెంచేశారు ఆయన. ఆ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ (ఫారినర్స్)ను కూడా ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial