బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ‘పఠాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సూపర్ హీరో ఈ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకొని సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ మూవీ హిట్ అవ్వడంతో షారుఖ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఆయన నుంచి వస్తోన్న ‘జవాన్’ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీను ఎప్పుడెప్పుడు చూద్దమా అని ఎదురు చూస్తున్నారు షారుఖ్ అభిమానులు. తాజాగా ‘జవాన్’ మూవీ గురించి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. 


‘జవాన్’ ట్రైలర్ చూసిన సల్మాన్ ఖాన్


షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘జవాన్’. ఈ మూవీకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. తాజాగా ‘జవాన్’ ట్రైలర్ ను హీరో సల్మాన్ ఖాన్ వీక్షించారు. అంతే కాదు ట్రైలర్ బాగుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు. ‘జవాన్’ ట్రైలర్ చూసి తనకు మజా వచ్చిందన్నారు సల్మాన్. ట్రైలర్ అద్భుతంగా ఉందని, తనకి బాగా నచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇలాంటి సినిమాను థియేటర్స్ లో చూడాలని సూచించారు. అంతేకాదు ‘జవాన్’ సినిమాని తాను కూడా మొదటి రోజే చూస్తానంటూ కూడా రాసుకొచ్చారు. దీంతో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలతో మూవీ పై హైప్ మరింత పెరిగింది. ‘పఠాన్’.. ‘జవాన్’గా మారిపోయాడంటూ ఫన్ చేశారు. ప్రివ్యూ చివర్లో షారుఖ్.. గుండుతో ఓల్డ్ సాంగ్ చేసే డ్యాన్స్ చూసి సల్మాన్ సంబరపడ్డారట.


సల్మాన్ కు థ్యాంక్స్ చెప్పిన షారుఖ్


షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ లో నటించిన ‘జవాన్’ సినిమా ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో సల్మాన్ ఖాన్ కూడా చూసి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు స్పెషల్ పోస్ట్ కూడా చేశారు. సల్మాన్ ఖాన్ పోస్ట్ కు షారుఖ్ రిప్లై ఇచ్చారు. తన సినిమాకు బెస్ట్ విషెస్ అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ‘జవాన్’ సినిమాకు మొదటి రోజు టికెట్ కొనినందుకు కూడా థ్యాంక్స్ లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చారు షారుఖ్. దీంతో సల్మాన్, షారుఖ్ ఖాన్ ల బ్రొమాన్స్ చూపి తెగ మురిసిపోతున్నారట ఈ ఇద్దరి హీరోల అభిమానులు. 


సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు ‘జవాన్’


తమిళ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిందీ మూవీ. ఈ మూవీలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా తమిళ్ హీరో విజయ్, దీపికా పడుకోణ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మూవీను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. 


Also read: ఇదంతా ఆయన వల్లే అంటూ స్టేజీపై కన్నీరు పెట్టుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial