Vaishnavi Chaitanya: దర్శకుడు సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘బేబీ’. ఈ సినిమాలో ఆందర్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్ లు మంచి పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. జులై 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇటీవలే మూవీ కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. తన సినిమా కెరీర్ గురించి చెప్తూ వేదికపైనే కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


యూట్యూబర్ హీరోయిన్ ఏంటి అని విమర్శించారు: వైష్ణవి చైతన్య


ఇటీవల జరిగిన ‘బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడిన ఎమోషనల్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘బేబీ’ సినిమా నిజ జీవితాల్లో జరిగే ఎన్నో సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని, ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ మూవీలో ఏదొక సందర్భం కనెక్ట్ అవుతుందని చెప్పిది. తనకు ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినపుడు తాను ఆశ్చర్యపోయానని అంది. ‘బేబీ’ కథకు తాను న్యాయం చేయగలనా అనే భయం మొదట్లో ఉండేదని, తనను నమ్మి ముందుకు నడిపించిన దర్శకుడు సాయి రాజేష్ కు థ్యాంక్స్ చెప్పింది. మొదట్నుంచీ తనకు లీడ్ రోల్స్ లోనే చేయాలనే కోరిక ఉండేదని, దాని కోసం ఎంతో నేర్చుకున్నానని తెలిపింది. 


ఆయన నాకు మరో జన్మనిచ్చారు: వైష్ణవి చైతన్య


ఈ కార్యక్రమంలో వైష్ణవి ఇంకా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాక పొగిడే వాళ్లతో పాటే విమర్శించే వారు కూడా ఉంటారని, యూటబ్యూర్ ఆర్టిస్ట్ హీరోయిన్ ఏంటని చాలా మంది విమర్శించారని పేర్కొంది. దర్శకుడు రాజేష్ సినిమా గురించి అన్ని విషయాలు వివరించి, తనకు ధైర్యాన్నిచ్చారని చెప్పుకొచ్చింది. ‘బేబీ’ సినిమాతో ఆయన తనకు మరో జన్మనిచ్చారని అంది. దర్శకుడు రాజేష్ వల్లే తానో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నానని అంది. అలాగే మూవీ నిర్మాత ఎస్కేఎన్ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తనను ఓ బేబీ లాగే చూసుకున్నారని ఎమోషనల్ అయింది. 


టిక్ టాక్ నుంచి ఇండస్ట్రీ వరకూ..


సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలా మంది సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. రీల్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు అంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు. ఆమె మొదట్లో టిక్ టాక్ వీడియోలు, ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించి పాపులర్ అయింది. ఆమె చేసిన కొన్ని వెబ్ సిరీస్ లు బాగా వైరల్ అయ్యాయి. దీంతో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. మొన్నామధ్య అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఓ పాత్రలో కనిపించింది. ఇప్పుడు ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా ఎంపికై అందర్నీ ఆశ్చర్యపరిచింది వైష్ణవి. మరి ఈ సినిమా ఆమె కెరీర్ కు ఎలాంటి బూస్టింగ్ ఇస్తుందో చూడాలి. 


Also Read: బాబోయ్‌, 'ప్రేమ్ కుమార్ కథ'ను గుర్తు పెట్టుకోవడం కష్టమే - ట్విస్టులే ట్విస్టులు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial