స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన కొత్త సినిమా 'టిల్లు స్క్వేర్'. 'డీజే టిల్లు'కు సీక్వెల్ ఇది. మార్చి 29న థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమాకు ఒక్క రోజు ముందు మలయాళ స్టార్ హీరో, 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆ వారం అప్సరా రాణి సినిమా సైతం విడుదల అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


మార్చి 29న అప్సరా రాణి 'తలకోన'
'ఫోర్ లెటర్స్', 'ఊల్లాల ఊల్లాల'తో తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ అప్సరా రాణి. ఆ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ... ఆమె గ్లామర్ హిట్ అయ్యింది.  టాలీవుడ్ స్టార్స్ సరసన స్పెషల్ సాంగ్స్ చేసే ఛాన్సులు తెచ్చింది. కొంత విరామం తర్వాత అప్సరా రాణి ప్రధాన పాత్రలో, కథానాయికగా నటించిన చిత్రం 'తలకోన (Talakona Movie). నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. అక్షర క్రియేషన్ పతాకంపై దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదొక ఫిమేల్ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.


Also Read: మెడికల్ ఫీల్డులో పెద్ద పేరు, ఇంకా హాస్పిటల్స్ - వెంకటేష్ రెండో అల్లుడు, వియ్యంకుడి బ్యాగ్రౌండ్ తెలుసా?



'తలకోన' నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... ''సినిమా అంతా అటవీ నేపథ్యంలో ఉంటుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు... ఈ సినిమాలో మరో కోణం కూడా ఉంటుంది. పాలిటిక్స్, మీడియా ప్రస్తావన సైతం సినిమాలో ఉంటుంది. ప్రకృతిలో ఏం జరుగుతాయో తెలిపే ప్రయత్నం చేశాం. అందుకు తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులను తీసుకున్నాం. ఈ నెల 29న విడుదల అవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది'' అని అన్నారు. 


'తలకోన' సినిమా గురించి దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ... ''అప్సర రాణి నటించిన వెరైటీ స్టోరీ ఇది. చిత్రీకరణ అంతా తలకోనలో అద్భుతంగా జరిగింది. ఓ కొత్త సినిమా చూసిన అనుభూతి ఉంటుంది. అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా" అని అన్నారు. తలకోన అడవిలోకి వెళ్లిన కొందరు స్నేహితులకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? వెళ్లిన వారిలో ఎంత మంది వెనక్కి తిరిగి వచ్చారు? తలకోనలో ఏం జరిగింది? అనేది కథ.


Also Read'టిల్లు స్క్వేర్' రీ రికార్డింగ్ - బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో సినిమా


అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్,  రంగ రాజన్, రాజా రాయ్  యోగి కంత్రి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నగేష్ నారదాసి, నిర్మాత:  దేవర శ్రీధర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాశింశెట్టి వీరబాబు, నిర్వహణ: పరిటాల రాంబాబు, కెమెరా: ప్రసాద్, సంగీతం: సుభాష్ ఆనంద్, ఫైట్స్: 'విన్ చిన్' అంజి.