అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన మోస్ట్ అవెయిటింగ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'డెకాయిట్' (Dacoit Movie). ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోందని ప్రకటించినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్మాతలు సినిమాలోని మరో ప్రధాన పాత్రను పరిచయం చేశారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ 'డెకాయిట్'లో ఓ కీలక పాత్రను పోషించబోతున్నారని అప్డేట్ ఇచ్చారు.
'డెకాయిట్'లో బాలీవుడ్ డైరెక్టర్ పవర్ ఫుల్ రోల్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందుతున్న భారీ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామా 'డెకాయిట్'. పవర్ ప్యాక్డ్ ఇంటెన్స్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాలో మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునే ప్రియుడిగా అడివి శేష్ కనిపించబోతున్నాడు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం వంటి ఎమోషన్స్ తో మూవీ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు అంటూ తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అనురాగ్ పాత్ర పేరు ఇన్స్పెక్టర్ స్వామి. ఆయన ఇందులో భాగం కావడం పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తన పోస్టర్ ను షేర్ చేశారు. ఆ పోస్ట్ లో "అయ్యప్ప భక్తుడైన పోలీసు అధికారురిగా నటించడం సరదాగా, ఛాలెంజింగ్ గా ఉంది. ఈ పాత్రను రెండు భాషల్లో పోషించడానికి నేను నిజంగా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. హిందీలో, తెలుగులో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నాను. అయితే రెండు భాషల్లో ఒకే ఎఫెక్ట్ తీసుకురావడం అన్నది నిజంగా ఛాలెంజింగ్. నేను ఈ రోల్ చేయడాన్ని ఆనందిస్తున్నాను" అని రాశారు. ఇక మరోవైపు అడివి శేష్ ఇన్స్పెక్టర్ స్వామి పాత్రకు సంబంధించిన పోస్టర్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "దీక్షలో ఉన్న పోలీస్ నన్ను పట్టుకుంటాడట. నన్ను పట్టుకోవాలంటే ఆ దేవుడే దిగి రావాలేమో" అంటూ 'డెకాయిట్' టీమ్ లోకి అనురాగ్ కశ్యప్ ని ఆహ్వానించారు.
'డెకాయిట్' షూటింగ్ అప్డేట్
ముందుగా 'డెకాయిట్' మూవీని అనౌన్స్ చేసినప్పుడు శృతి హాసన్, అడివి శేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నట్టు అఫీషియల్ గా ఓ వీడియో ద్వారా ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత ఈ మూవీ నుంచి శృతిహాసన్ తప్పుకుందని రూమర్లు వినిపించాయి. ఆ రూమర్లకు తగ్గట్టే శృతిహాసన్ ప్లేస్ ను మృణాల్ ఠాకూర్ రీప్లేస్ చేసింది. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ మూవీ రూపొందుతోంది. 'డెకాయిట్' కథ, స్క్రీన్‌ప్లేను అడివి శేష్, షానియల్ డియో సంయుక్తంగా రూపొందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. తరువాత మహారాష్ట్రలో ఓ షెడ్యూల్ జరగనుంది.
Also Read: అగత్యా రివ్యూ: భయానికి, వినోదానికి మధ్య సంఘర్షణ... తమిళ హారర్ కామెడీ ఎలా ఉందంటే?