సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తమ్ముడు రాజా బాబు గురువారం (ఫిబ్రవరి 28న) మృతి చెందారు. హైదరాబాద్లోనే తన నివాసంలో రాజా బాబు గురువారం సాయంత్రం అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచినట్టు సమాచారం. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఈ వార్త తనను ఎంతగానో కలచి వేసిందంటూ జయప్రద ఎమోషనల్ పోస్ట్ చేసింది. 


జయప్రద పోస్ట్ లో ఏముందంటే...
జయప్రద పోస్ట్ లో "నా సోదరుడు రాజాబాబు మరణ వార్తను మీకు తెలియజేయడం బాధాకరంగా ఉంది. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3:26 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన చనిపోయారు. దయచేసి ఆయన గురించి అందరూ ప్రార్థించండి. మరిన్ని వివరాలను త్వరలోనే షేర్ చేస్తాను" అంటూ ఇన్స్టా పోస్టులో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇలాంటి కష్ట సమయంలో తన కుటుంబానికి సపోర్టుగా ఉండాలని, సోదరుడి ఆత్మ శాంతి కోసం ప్రార్థించాలని జయప్రద అభిమానులను ఈ సందర్భంగా కోరారు. కాగా హైదరాబాదులోనే రాజబాబు అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు సమాచారం. జయప్రద సోదరుడు కన్ను మూశాడన్న వార్త తెలిసిన ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Also Read: నెక్ట్స్ టార్గెట్ శ్రీ రెడ్డి... పోసాని అరెస్టుతో సంకేతాలు వెళ్లాయా? బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?






జయప్రద సినిమా జర్నీ విషయానికి వస్తే... 
ఆమె 14 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 1976 నుంచి 2005 వరకు దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించి, తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అందులోనూ జయప్రద 1980లో తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. టాలీవుడ్ దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల్లో సైతం ఆమె హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటించి అలనాటి పేక్షకులను ఆకట్టుకున్నారు. జయప్రదకు తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు లలితా రాణి. 'భూమి కోసం' సినిమాతో కెరీర్‌ ను ప్రారంభించిన ఆమె ఆ తరువాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ రేసులోకి దూసుకెళ్లింది. ప్రముఖ తమిళ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన 'అంతులేని కథ' సినిమా తరువాత ఆమె తన పేరును జయప్రదగా మార్చుకున్నారు. 


అలాగే రాజకీయాల్లో సైతం చురుకుగా కొనసాగుతున్నారు. 1994లో ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీలో చేరిన ఆవిడ, ఆ పార్టీలో జరిగిన గొడవల కారణంగా రెండేళ్లకే బయటకొచ్చింది. అనంతరం సమాజ్ వాది పార్టీలో చేరిన జయప్రద ఆ తర్వాత ఆ పార్టీలో నుంచి కూడా బయటకు వచ్చి, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఇక ఆవిడ ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉందన్న సంగతి తెలిసిందే. 


Read Also : సరికొత్త తెలుగు సీరియల్ 'లక్ష్మీ నివాసం'లో పవిత్రా లోకేష్... టెలికాస్ట్ ఎప్పటి నుంచి అంటే ?