మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా రూపొందుతున్న బయోపిక్ 'టైగర్ నాగేశ్వర రావు' (Tiger Nageswara Rao). ఇందులో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు. వాళ్లిద్దరూ కాకుండా మరొక బ్యూటిఫుల్ లేడీ కూడా ఉన్నారు. ఆ తమిళ బ్యూటీ లుక్ ఈ రోజు విడుదల చేశారు. 


జయవాణి పాత్రలో అనుకీర్తీ వ్యాస్!
Anukreethy Vas First Look : 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలో జయవాణి పాత్రలో అనుకీర్తీ వ్యాస్ నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది. తెలుగులో అనుకీర్తికి తొలి చిత్రమిది. ఇంతకు ముందు విజయ్ సేతుపతి తమిళ సినిమా 'డీఎస్పీ'లో నటించారు. 2018లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా!


Also Read : 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?


అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వర రావు'. 'కశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' విజయాల తర్వాత ఆయన నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. మధ్యలో రవితేజతో ధమాకా కూడా నిర్మించారు. ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. అక్టోబర్ 3న సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. 


ఇప్పటి వరకు రవితేజ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. పవర్ ఫుల్ రోల్స్ కూడా చేశారు. అయితే... స్టూవర్టుపురం నాగేశ్వరరావు పాత్రలో ఆయన ఆహార్యం చాలా కొత్తగా ఉందని చెప్పాలి. ఆయన లుక్స్ పవర్ ఫుల్ గా ఉండటమే కాదు... వాయిస్ లో బేస్ కూడా పవర్ చూపించింది.


''నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే... వాడి తెలివితేటలతో ఎలక్షన్స్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉంటే... వాడి పరువుతో ఇండియాకు మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లి ఉంటే... వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. దురదృష్టవశాత్తూ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు సార్'' అని సినిమా టీజర్లో మురళీ శర్మ చెప్పే డైలాగ్ కానీ, ఎనిమిదేళ్ళకు రక్తం తాగడం మొదలు పెట్టాడనే డైలాగ్ కానీ హీరోయిజం చూపించింది.  


Also Read : చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్‌లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?



 
దసరా బరిలో 'టైగర్...' విడుదల
దసరా సందర్భంగా అక్టోబర్ 20న 'టైగర్ నాగేశ్వర రావు' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రవితేజకు జోడీగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. 1970లలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ఆర్. మది, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar), ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సంభాషణల రచయిత : శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial