Animal Movie HD Print Leak : ‘యానిమల్’ మూవీ టీంకి భారీ షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలై 24 గంటలు గడవకముందే అప్పుడే ఆన్ లైన్ లో హెచ్ డీ ప్రింట్ తో లీక్ అయింది.


బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం 'యానిమల్' అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ డిసెంబర్ 1 శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందింది.


సినీ లవర్స్ ఈ ఇయర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన 'యానిమల్' ప్రస్తుతం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన 'సామ్ బహదూర్' సైతం విడుదలవ్వగా ఆడియన్స్ లో 'యానిమల్' పైనే ఎక్కువ బజ్ కనిపించింది. ఎర్లీ మార్నింగ్ షో తోనే రిలీజ్ అయిన ఈ మూవీకి ఫ్యాన్స్ తో పాటూ సినీ క్రిటిక్స్ సైతం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో మూవీ టీం కి భారీ షాక్ తగిలింది. 'యానిమల్' విడుదలై 24 గంటలు కాకముందే ఆన్లైన్లో లీక్ అయింది.


తమిళ్ రాకర్స్, టెలిగ్రామ్, మూవీ రూల్స్.. వంటి పలు పైరసీ వెబ్ సెట్స్ ఈ సినిమాని ఉచితంగా అది కూడా హెచ్ డీ క్వాలిటీ తో డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించాయి. విడుదలై 24 గంటల గడవకముందే ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ లీక్ అవ్వటం బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి దీనిపై 'యానిమల్' మేకర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇలా విడుదలైన 24 గంటల్లోపే సినిమా ఆన్ లైన్ లో లీక్ అవడం ఇదేం తొలిసారి కాదు.


టైగర్ త్రీ, 12th ఫెయిల్, తేజస్, ఘోస్ట్, టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి, గణ్ పత్, లియో, ధక్ ధక్ ఫక్రే, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి అనేక సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజే ఆన్లైన్లో లీకయ్యాయి. తాజాగా ఈ లిస్ట్ లో యానిమల్ మూవీ కూడా చేరింది. ఇలాంటి పైరసీ సైట్స్ పై గతంలో అనేక ఘటన చర్యలు తీసుకున్నా ఇంకా ఎక్కడో చోట కొత్త సినిమాలు ఆన్లైన్లో లేకపోవడం గమనార్హంగా మారింది. ఇప్పటికే పైరసీ సైట్ గా పేరొందిన తమిళ్ రాకర్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. అయినా కూడా కొత్త డొమైన్ తీసుకొని మరీ సినిమాల పైరేటెడ్ వర్షన్స్ నడుపుతున్నారు.


Also Read : పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ - ఎప్పటికైనా సినిమా చేసి తీరుతా, మెహర్ రమేష్ షాకింగ్ కామెంట్స్!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply