Tollywood Celebrities Wishes to Chandrababu Naidu and Pawan Kalyan: ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా అని దేశమంత ఎదురుచూసింది. నేటితో ఆ ఎదురుచూపులకు ఎండ్‌ కార్డు పడింది. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. రాష్ట్రంలో కూటమీ హవా చూపించింది. అత్యధిక సీట్లు కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో గెలిచి అధికార పార్టీ వైసీసీకి షాకిచ్చింది.


ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 10 సీట్లకే పరిమితమై ప్రతిపక్షంలో నిలిచింది. ఇక కూటమి భారీ మెజారిటీతో గెలవడం, పిఠాపురంలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అత్యధిక మెజారిటీ ఓట్లతో ఘన విజయం సాధించడంతో ఇండస్ట్రీ వర్గాలు సోషల్‌ మీడియాలో వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. విలక్షణ నటుడు మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు. "మీ అద్భుతమైన విజయానికి అభినందనలు! మీ నాయకత్వంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు. కంగ్రాట్స్‌ @ncbn,@naralokesh, @PawanKalyan, @NandamuriBalakrishna" విషెస్‌ తెలిపారు. 






అదే విధంగా స్టార్‌ డైరెక్టర్లు అనిల్‌ రావిపూడి, గోపిచంద్‌ మలినేని, క్రిష్‌ జాగర్లమూడి నుంచి మాస్‌ మహారాజా రవితేజ, హీరో నాని వరకు తదితర నటీనటులు, దర్శకులు పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడికి శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధదించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు విషెస్‌ తెలుపుతున్నారు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ అద్భుతమైన విజయం, పదేళ్లుగా ఆయన చేస్తున్న పోరాటాన్ని కొనియాడుతున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లది చారిత్రాత్మక విజయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఎవరెవరూ ఏమన్నారో వారి పోస్ట్స్‌లో చూడండి.