Chiranjeevi Tweet On Pawan Kalyan Victory: ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయ దుందుభి మోగించింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆయన తన పార్టీ తరఫున 21 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడితే... అన్నిటిలో విజయఢంకా గట్టిగా మోగించారు. ఈ విజయం పవన్ అన్నయ్య, మెగా ఫ్యామిలీ మూలవిరాట్ చిరంజీవి (Chiranjeevi)కి అత్యంత ఆనందం కలిగించింది. తమ్ముడిని అభినందిస్తూ చిరు ట్వీట్ చేశారు.


కళ్యాణ్ బాబూ... అన్నగా గర్వంగా ఉంది!
''డియర్ కళ్యాణ్ బాబు... ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది'' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 'ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు' అని 'అత్తారింటికి దారేది'లో త్రివిక్రమ్ రాసిన డైలాగును గుర్తు చేసేలా తమ్ముడిని అభినందించారు. 



ఏపీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమికి సుస్పష్టమైన మెజార్టీ వచ్చిన తర్వాత ట్వీట్ చేసిన చిరంజీవి... ''నువ్వు (పవన్ కళ్యాణ్) Game Changerవి మాత్రమే కాదు, Man of the matchవి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది'' అని సంతోషం వ్యక్తం చేశారు.


Also Readపవన్ కళ్యాణ్ ఓటమికి తల వంచలేదు... ఈ విజయం ఒక్క రోజులో వచ్చినది కాదు


''నీ (పవన్ కళ్యాణ్) కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని సాకారం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ... ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు'' అని తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ ప్రారంభించే కొత్త అధ్యాయంలో శుభం కలగాలని, పవన్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానట్లు చిరు తెలిపారు.


Also Readపవన్ ఫ్యాన్స్ ముగింట ట్రెండ్స్ ఎంత - వాట్సాప్ స్టేటస్, ట్విట్టర్ వీడియో షేర్స్‌తో హల్‌ చల్






ఎన్నికల ఫలితాలను లైవ్ చూస్తున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ పవన్ విజయం తెలియగానే భావోద్వేగానికి గురయ్యారు. పవన్ సోదర సోదరీమణులు ఆనంద భాష్పాలతో కూడిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.


Also Read: పవన్‌ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్ - ట్రోల్ చేస్తున్న మెగా, జనసేన ఫ్యాన్స్!