Ananya Nagella Tantra Movie: కూల్ క్యారెక్ట‌ర్స్, క్లాసిక్ క్యారెక్ట‌ర్స్ చేసిన హీరోయిన్ అన‌న్య నాగెళ్ల‌. ప‌ద‌హారునాళ్ల తెలుగ‌మ్మాయిలా అన్నీ చ‌క్క‌టి పాత్ర‌లు పోషించింది. అయితే, ఇప్పుడు అందరినీ భ‌య‌పెట్టేందుకు వ‌చ్చేసింది. 'తంత్ర' అనే హార‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది అన‌న్య‌. మార్చి 15న ఈ సినిమా రిలీజ్ కాగా.. సినిమా రిలీజ్ కి రిలేటెడ్ గా ఆమె ఒక ఫ‌న్నీ వీడియో రిలీజ్ చేసింది. "కోయ‌దొర చెప్పింది ఈ రోజు నిజం అవుతుందో లేదో చూడాలి" అంటూ ఆ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. 


ఫేస్ చూసి ఎట్ల చెప్తాడు?


అన‌న్య నాగెళ్ల న‌టించిన సినిమా హిట్ అవుతాడ‌ని గ‌తంలో కోయదొర చెప్పిన విష‌యం తెలిసిందే. కోయ‌దొరే స్వ‌యంగా ఆమెను పిలిచి 'తంత్ర' హిట్ అవుతుంద‌ని చెప్పిన‌ట్లు గ‌తంలో పోస్ట్ చేసింది అన‌న్య. ఇప్పుడు దానికి సంబంధించి మ‌రో పోస్ట్ పెట్టింది ఆమె. కోయ‌దొర చెప్పింది నిజం అవుతుందో లేదో చూడాలి అని ఆ క్యాప్ష్‌న్ రాసింది. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ప్రేక్ష‌కుల‌తో అన్ని పంచుకునే అన‌న్య కోయ‌ దొర‌తో మాట్లాడిన వీడియోను త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. "ఫేస్ చూసి ఎలా చెప్తాడు? నేను గ్లాసెస్ పెట్టుకున్నాను క‌దా? మేక‌ప్ వేసుకున్నాను క‌దా? ఫేస్ ఎట్ల ఉంట‌దో ఆయ‌న‌కు ఎట్లు తెలుసు?" అని అన‌న్య అడిగిన ప్ర‌శ్నకి కోయ‌దొర వెరైటీ స‌మాధానం చెప్పాడు.  ఫ‌న్నీ ఆన్స‌ర్ ఇచ్చాడు. "మేక‌ప్ వేసుకున్నా ముఖం అయితే ఒక‌టే క‌దా? గోడ‌కి సిమెంట్ వేస్తేనే క‌దా అందంగా క‌నిపించేది. ముఖానికి మేక‌ప్ కూడా అలాంటిదే" అంటూ ఆన్స‌ర్ ఇచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన ప్ర‌తి ఒక్క‌రు "కోయ దొర చెప్పింది నిజ‌మే అవుతుంది. సినిమా స‌క్సెస్ అవుతుంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


మొద‌టి నుంచి వినూత్నంగా ప్ర‌చారం


హార‌ర్ జోన‌ర్ లో వ‌చ్చిన ఈ సినిమాకి ప్రమోష‌న్స్ గ‌ట్టిగానే ప్లాన్ చేసింది టీమ్. మొద‌టి నుంచి సినిమాని వైవిధ్యంగానే ప్ర‌మోట్ చేశారు. పోస్ట‌ర్ రిలీజ్, టీజ‌ర్, ట్రైల‌ర్ అన్నీ ఉత్కంఠ రేకెత్తేలా క‌ట్ చేశారు. ఇక ప్ర‌చారం కూడా వెరైటీగా చేశారు. పిల్ల బ‌చ్చాలు సినిమాకి రావొద్ద‌ని భ‌య‌పెట్టడం, అన‌న్య‌తో ర‌క్తం అమ్మించ‌డం లాంటివి చేశారు. అలా సినిమాపై ఇంట్రెస్ట్ క‌లిగించారు మేక‌ర్స్. 


చాలా కాలం తర్వాత మళ్లీ కనిపించబోతున్న సలోని


ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలపై నరేష్ బాబు పి, రవి చైతన్య ‘తంత్ర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్యా నాగళ్ల ఈ జానర్ సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ మూవీలో సీనియర్ నటి సలోని ఓ కీలక పాత్ర పోషిస్తోంది. చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపిస్తోంది. ధ‌నుష్ ర‌ఘుముద్రి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. టెంప‌ర్ వంశీ, మీసాల ల‌క్ష్మ‌ణ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. నరేష్ బాబు, రవి చైతన్య ‘తంత్ర’ సినిమాను నిర్మిస్తున్నారు.


Also Read: సినిమా ఛాన్సుల కోసం వెళ్తే.. అలా అడిగారు, కాస్టింగ్ కౌచ్‌పై ఆమని షాకింగ్ కామెంట్స్