Brahma Anandam Movie Songs : బ్రహ్మా ఆనందం చిత్ర యూనిట్ ప్రమోషన్స్​ జోరు పెంచింది. తాజాగా ఆనందమాయే అనే లిరికల్ సాంగ్​ని విడుదల చేసింది. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో పద్మశ్రీ బహ్మానందం, ఆయన కుమారుడు రాజాగౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో.. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హీరోయిన్స్​గా నటిస్తున్నారు. ఇప్పటికే బహ్మనందంతో కలిసి ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రమోషన్స్ చేసిన చిత్రబృందం.. ఇప్పుడు సాంగ్​తో మూవీ బజ్​ని పెంచేసింది.


సాంగ్ ఎలా ఉందంటే.. 


‘బ్రహ్మా ఆనందం’ సినిమాకు శాండిల్య పిసపాటి మ్యూజిక్ అందించారు. తాజాగా ‘ఆనందమాయే‘ అంటూ వినసొంపైన ట్రాక్​ని అందించారు. ‘కనువిందైనా కలలు అల్లింది అందంగా మది‘ అంటూ మొదలైంది ఈ సాంగ్​ను శ్రీసాయి కిరణ్ రాశారు. మనిషా ఈరబత్తిని, యశ్వంత్ నాగ్ వారి గాత్రంతో పాటకు అందాన్ని తీసుకువచ్చారు. దీనిని ఓ క్యూట్​ లవ్​ సాంగ్​గా చెప్పొచ్చు. 


ఆనందమాయే సాంగ్ లిరిక్స్ (Anandamaaye Song Lyrics)


కనువిందైన కలలు అల్లింది అందంగా మది
నిలవని పరుగుల్లోన పడిలేస్తోంది నీ వెంటే అది
వినదుగా నిన్ను చూడగానే దానికెందుకింత మారం
పరదాలు లేని గాలిలాగా దూకుతోంది పాదం
ఇటు చూడు చూడు చూడు చూడు నావైపోసారి
నీలోన చేరి మారిపోయా వేరేదో దారి


ఆనంద మానంద మానందమాయే.. మెల్లగా అల్లిన సంబరమాయే
ఆనంద మానంద మానందమాయే.. మాటలకందని మౌనమాయే


ఏహే మాయదారి లక్కు నన్ను గుర్తు పట్టదాయే
చూసి చూడనట్టు చూడగానే పారిపోయే
అర్థమైతే ఒట్టు ఫేటు రూటు మారదాయే
ఇంత టార్చరేందిరా.. అ
కళ్లముందరున్న తిండి నోటికందదాయే..
అప్పులన్నీ చూస్తే లెక్కలేమో చుక్కలాయే
పక్కనేమో చందమామలాంటి అందమున్నా..
పట్టనట్టు ఉండే గుండెకేమైందో చెప్పదేరా
ఏ దయ రాదేరా.. ఈ వ్యథ తీరేదా నా కథ మారేదా ఇదే గొడవ
అమ్మ నీయమ్మా.. 
గోవిందా గోవిందా ఏమైనా దారుందా.. నా మొర వినవా? ఊ అనవా?
అరె ఇటు సూడు సూడు సూడు సూడు ఏంటి విడ్డూరం.. కలనైనా రాత మారదేంటో అయ్యో అన్యాయం


ఆనంద మానంద మానందమాయే.. ఆనందమన్నది అందనిదాయే
ఆనంద మానంద మానందమాయే.. మాటలు తోచని మౌనమాయే


హీరోయిన్​కి ప్రేమ కావాలి.. హీరోకి డబ్బు కావాలి.. 


ఈ క్యూట్ లవ్ సాంగ్​లో రెండు రకాల ఎక్స్​ప్రెషన్స్ చూపించారు. హీరోపై ఉన్న ప్రేమను హీరోయిన్ వర్ణిస్తూ పాడుతుంటే.. హీరో మాత్రం డబ్బుపై తనకున్న ప్రేమను, అవసరాన్ని పాటగా వివరిస్తూ ఉంటారు. ఇద్దరు భిన్నమైన మనస్తత్వాలున్నా వ్యక్తులను పాట రూపంలో పరిచయం చేశారు. ''పాట అద్భుతంగా ఉంది పాట చిత్రీకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది చిత్రం అద్భుతంగా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు❤❤❤🎉🎉🎉🎉🎉'' ఇప్పటికే అభిమానులు యూట్యూబ్ ద్వారా విషెష్ చెప్తున్నారు. 


నాలుగో హిట్ లోడింగ్.. 


మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ అందుకొని.. అదే జోష్​తో స్వధర్మ్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్ బ్రహ్మ ఆనందం సినిమాతో వస్తుంది. 100% సక్సెస్ రేట్​ ఉన్న ఈ బ్యాన్సర్​లో బ్రహ్మ ఆనందం సినిమా రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ బ్యానర్​లో మరో హిట్​ లోడ్ అవుతుంది అంటూ బజ్ వినిపిస్తోంది. పైగా ఈ సినిమాలో వెన్నెల కిశోర్ ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్నారు. రాజీవ్ కనకాల కూడా నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే పెరిగాయి.



Also Read : పింక్ షర్ట్​లో హాట్ ఫోటోషూట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. క్యాప్షన్ ఫ్యాన్సే చెప్పాలట