సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paat) చూశారా? తెలుగు ప్రేక్షకుల్లో మెజారిటీ జనాలు చూశారు. పలువురు సినిమా, రాజకీయ ప్రముఖులు కూడా చూశారు. ఇప్పుడు ఈ సినిమాను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చూడనున్నారు. అందుకు కారణం ఏంటంటే...  


Mahesh Babu Drives Jawa Maroon Bike: 'సర్కారు వారి పాట'లో హీరో నడిపిన బండి గుర్తు ఉందా? అదేనండీ... విలన్ సముద్రఖనికి వార్నింగ్ ఇవ్వడానికి వెళతారు కదా! మొదట బండి మీద వెళ్లినా... ఆ తర్వాత బండి పక్కన పెట్టి లారీ తీసుకు వెళతారు. అది జావా మెరూన్ మోడల్. సముద్రఖనికి వార్నింగ్ ఇవ్వడానికి బయలుదేరే సన్నివేశంతో పాటు మరో రెండు మూడు సన్నివేశాల్లో జావా బైక్ డ్రైవ్ చేశారు. ఇప్పుడు మహీంద్రా గ్రూప్‌కు చెందిన క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ జావా బైక్స్‌ను తయారు చేస్తోంది. బహుశా... అందువల్లే, ఆనంద్ మహీంద్రా సినిమా చూడాలని డిసైడ్ అయ్యారు. 


'సర్కారు వారి పాట'లో జావా బైక్ మీద మహేష్ బాబు ఉన్న విజువల్స్‌ను క్లాసిక్ లెజెండ్స్ కో-ఫౌండర్ అనుపమ్ ట్వీట్ చేశారు. దానిని కోట్ చేసిన ఆనంద్ మహీంద్రా ''మహేష్ బాబు, జావా కాంబినేషన్ చూడటం నేను ఎలా మిస్ అయ్యాను? ప్రస్తుతం నేను న్యూయార్క్ లో ఉన్నాను. న్యూజెర్సీలో సినిమా ప్రదర్శిస్తున్నారు. అక్కడికి వెళ్లి చూస్తా'' అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్ పట్ల సూపర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: నాగచైతన్య హిందీ సినిమా ట్రైలర్ వచ్చేసింది - ఆమీర్ హృదయాన్ని తాకుతాడు!






మే 12న 'సర్కారు వారి పాట' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. పరశురామ్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు.


Also Read: సిద్ధూ ఆఖరి పాట ‘లాస్ట్ రైడ్’లో చెప్పినట్లే హత్యే, మరణాన్ని ముందే ఊహించాడా?