రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) కమర్షియల్ కథలు కాకుండా విభిన్న తరహా కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఆయన నటించిన 'బేబీ' మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. అందులో తన నటనతో ఆనంద్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆనంద్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచింది. ఇప్పుడు మరో సినిమాతో తన సక్సెస్ ను కంటిన్యూ చేసేందుకు రెడీ అయ్యాడు ఈ యంగ్ హీరో.


ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా' (Gam Gam Ganesha movie).  రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ మూవీ పోస్టర్స్ లో మాస్ లుక్ తో అదరగొట్టేసాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే ఆనంద్ ఈ మూవీతో మరో హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. ఇక టీజర్ ని గమనిస్తే.. ఈ చెడు ప్రపంచంలో మంచిగా బతకాలి అనుకోవడం, చెడు ఆలోచన అనే కొటేషన్ తో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత చాలా సరదాగా సాగింది.



'అమ్మాయిలను టీజ్ చేస్తే పెదాలపై నవ్వు రావాలి కానీ, కళ్ల వెంట నీరు రాకూడదు' అంటూ ఆనంద్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. టీజర్ సరదాగా సాగుతుందని అనుకునే లోపు విలన్ ఎంట్రీ వచ్చింది. మధ్యలో హీరోయిన్ తో ఓ లిప్ లాక్ కూడా చూపించారు. ఈ విషయంలో మాత్రం ఆనంద్ తన అన్నని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక టీజర్ లో ఓ వినాయకుడు విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి వీళ్ళ కథతో ఉన్న సంబంధం ఏంటి? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక టీజర్ లో ఆనంద్ మాస్ లుక్, కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇక టీజర్ చూస్తే సినిమాలో ఎక్కువమంది కొత్త వాళ్ళనే తీసుకున్నట్లు కనిపిస్తోంది.


Also Read : 'జవాన్' పాటకు హాస్పిటల్‌లో డ్యాన్స్ చేసిన పేషేంట్ - స్పందించిన షారుఖ్


అంతే కాకుండా ఆనంద్ దేవరకొండను ఇప్పటి వరకు చాలా సాఫ్ట్ గా, పక్కింటి అబ్బాయి పాత్రలోనే చూసాం. కానీ ఈ మూవీతో ఆనంద్ దేవరకొండ పూర్తి యాక్షన్ హీరోగా మారే అవకాశం ఉంది. ఉదయ్ భూమి శెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. క్రైమ్ అండ్ యాక్షన్ రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేనున్నట్లు సమాచారం. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్గా నటిస్తుండగా.. కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


Also Read : ‘డెవిల్’ మూవీలో ‘మాయే చేసే’ పాట గ్లింప్స్ విడుదల - కళ్యాణ్ రామ్, సంయుక్త మధ్య అందమైన ప్రేమకథ!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial