'ఆడవాళ్ళు మీకు జోహార్లు'... శర్వానంద్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ఇది. 'పుష్ప: ద రైజ్' తర్వాత థియేటర్లలో విడుదలైన రష్మిక సినిమా కూడా ఇదే. కొంత విరామం తర్వాత ఆమె నటించిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఈ సినిమా చూసిన విమర్శకులు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు చెప్పారు. రివ్యూలు రాశారు. రేటింగ్‌లు ఇచ్చారు. మరి, సినిమాలో కథానాయికగా నటించిన రష్మిక తల్లి సుమన్ మందన్నా ఏమన్నారో తెలుసా?
"ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాను శుక్రవారం మా అమ్మానాన్న చూశారు. మా నుంచి వచ్చిన రివ్యూ ఏంటంటే... ఇటువంటి ఫ్యామిలీ సినిమా చూసి చాలా రోజులు అయ్యిందని అమ్మ చెప్పింది. మంచిగా అనిపించిందని సంతోషం వ్యక్తం చేసింది. ఫైట్లు, లో యాంగిల్, స్లో మోషన్ హీరో షాట్స్ లేకుండా ఉన్న చిత్రమిది. ఇంట్లో అందరినీ, ముఖ్యంగా ఆడవాళ్ళను రిప్రజెంట్ చేసే చిత్రమిది" అని రష్మిక మందన్నా చెప్పారు. శనివారం ఏర్పాటు చేసిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' మీడియా సమావేశంలో థియేటర్లకు ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ రావడం చూశానని చెప్పారు.
Also Read: విజయ్ దేవరకొండతో పెళ్లిపై స్పందించిన రష్మిక
నిజ జీవితంలో తన తల్లి ఎలా ఉంటారు? అనే విషయంతో పాటు పెళ్లి గురించి ఆమె అభిప్రాయాల గురించి రష్మిక చెబుతూ... "మా అమ్మ చాలా సరదాగా ఉంటుంది. 'నీకు అబ్బాయి నచ్చితే తీసుకుని రా' అంటుంది" అని అన్నారు. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా ప్రచార కార్యక్రమాల్లో రష్మిక పెళ్లి టాపిక్ హైలైట్ అవుతూ వస్తోంది. రష్మిక కూడా ఏమాత్రం విసుక్కోకుండా, చిరాకు పడకుండా పెళ్లి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. తనకు ఇంకా పెళ్లి వయసు రాలేదని ఆమె ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ: ఫస్టాఫ్ హిట్టు - సెకండాఫ్ గురించి మీకు అర్థమవుతోందా?