అల్లు శిరీష్ (Allu Sirish) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'బడ్డీ' (Buddy Movie). తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల హీరో పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. 


శిరీష్ జోడీగా ప్రిషా సింగ్!
'బడ్డీ'లో అల్లు శిరీష్ సరసన ఉత్తరాది భామ ప్రిషా సింగ్ (Prisha Singh) నాయికగా నటిస్తున్నారు. నిఖిల్ 'స్పై' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారామె. అందులో ఓ రోల్ చేశారు. 'బడ్డీ'లో కథానాయికగా చేస్తున్నారు. 


'బడ్డీ'లో గగనసఖిగా...
'బడ్డీ' సినిమాలో గగనసఖిగా ప్రిషా సింగ్ నటిస్తున్నారు. అంటే... ఎయిర్ హోస్టెస్ రోల్ అన్నమాట. కెరీర్ స్టార్టింగ్‌లో ఇటువంటి రోల్ తనకు లభించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్యారెక్టర్ ఫ్లైట్ జర్నీలు ఎక్కువ చేశానని, ఎయిర్ హోస్టెస్ ఎలా మాట్లాడతారు? వంటి విషయాలు గమనించానని, రోల్ కోసం కొంత ప్రిపేర్ అయ్యానని ప్రిషా సింగ్ చెప్పుకొచ్చారు. అదీ సంగతి! 


Also Read : బాలకృష్ణ మాస్ విధ్వంసం - 'భగవంత్ కేసరి' టీజర్ వచ్చిందోచ్


'బడ్డీ'ని ప్రముఖ నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. దీనికి హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. 


Also Read : 'టక్కర్' రివ్యూ : మాస్ యాక్షన్ హీరో కావాలని సిద్ధార్థ్ ట్రై చేస్తే?



తక్కువ అంచనా వేయండి... 
'బడ్డీ' టీజర్ చూస్తే... 'మీరు ఏం చేస్తారో? ఎలా చేస్తారో? నాకు అనవసరం. ఈ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే... విన్న ప్రతి ఒక్కడి ఇంట్లో వణుకు పుట్టాలి. సరిగ్గా చూసుకోండి' అని వాయిస్ ఓవర్ వినపడుతుంటే... మెట్రోలో చాలా మంది ముసుగు వేసుకున్న వ్యక్తులు (రౌడీలు) కనబడతారు. డైలాగ్ పూర్తి అయిన తర్వాత 'వాంటెడ్' పోస్టరులో 'టెడ్డీ బేర్' ఫోటో ఉంటుంది. అది చూసి అందరూ నవ్వుతారు. కాసేపటికి రౌడీల ముందు నిలబడిన వ్యక్తి వెనుక ఓ డోర్ ఓపెన్ అవుతుంది. అందులో బోలెడు డబ్బు ఉంటుంది.  


నవ్విన ప్రతి ఒక్కరికీ ఆ ముసుగు వీరుడు ఓ మాట చెబుతాడు. 'అంత తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడే మొదలైంది కదా! త్వరలో మీకే అర్థం అవుతుంది' అంటాడు. ఆ తర్వాత టెడ్డీని ఇంట్రడ్యూస్ చేశారు. అదీ మెట్రోలోనే! ఆ రౌడీల నుంచి టెడ్డీని కాపాడుతున్న హీరో (అల్లు శిరీష్)ను ఇంట్రడ్యూస్ చేశారు. మెట్రోలో రౌడీలను ఊచకోత కోశారు. దాంతో ముసుగు వీరుడు 'సిటీలో ఉన్న మనవాళ్ళు అందరినీ రమ్మను' అని ఫోన్ చేస్తాడు. అటు నుంచి 'బొమ్మ కోసం అంత మంది ఎందుకు?' అని ప్రశ్న! 'ఆ బొమ్మ ఒంటరిగా లేదు. దాని వెనుక ఒకడు ఉన్నాడు' అని సమాధానం. మొత్తం మీద గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్: ఆర్ శక్తి శరవణన్, ఆర్ట్ డైరెక్టర్: సెంథిల్ రాఘవన్.