హర్షిత్ రెడ్డి (Harshith Reddy), '30 వెడ్స్ 21' ఫేమ్ అనన్యా శర్మ, తేజస్వి మాదివాడ (Tejaswi Madivada) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'అర్థమైందా అరుణ్ కుమార్'. ఇది ఆహా ఒరిజినల్ సిరీస్. జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కంటే ముందు ఆయన తీసిన 'అమరం అఖిలం ప్రేమ' సైతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... 'అర్థమైందా అరుణ్ కుమార్' సిరీస్ టీజర్ విడుదల చేశారు.
కాఫీలు, కార్ పార్కింగ్, ఇంకా ఇంటర్న్ కష్టాలు!
అరుణ్ కుమార్ కార్పొరేట్ ఆఫీసులో జాయిన్ అయ్యాడు. తనకు ఏదైనా ప్రాజెక్ట్ అసైన్ చేస్తారేమో అని ఆశ పడితే... ఒకరు కాఫీ పెట్టి అందరికీ ఇవ్వమని చెబుతారు. ఇంకొకరు ఏమో కార్ పార్క్ చేయమని ఆర్డర్ వేస్తారు. మరీ దారుణం ఏమిటంటే ఒక సీనియర్ అధికారి బాత్రూమ్ ఫ్లష్ చేయమంటారు. చివరకు, అరుణ్ కుమార్ జీవితం ఏమైంది? అనేది చూడాలంటే నెలాఖరు వరకు వెయిట్ చేయాలి. న్యూ జనరేషన్ యువత తమను ఐడెంటిఫై చేసుకునేలా సిరీస్ తీసినట్టు అర్థం అవుతోంది.
ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పట్నించి అంటే...
Ardhamayyindha Arun Kumar Release Date : జూన్ 30వ తేదీ నుంచి ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఆరె స్టూడియోస్, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ సంస్థలు 'అర్థమైందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ రూపొందించాయి. ఇటీవల అరుణ్ కుమార్ పాత్రలో నటించిన హర్షిత్ రెడ్డి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అది చూస్తే... లాప్ టాప్ మీద 'ఒక కార్పొరేట్ స్లేవ్ (బానిస) కథ' అని ఉంటుంది.
Also Read : అమెరికాలో ఆదిపురుషుడు - అభిమానులకు ఓ బంపర్ ఆఫర్
అరుణ్ కుమార్ కథ ఏమిటి?
ఏపీలోని అమలాపురం అరుణ్ కుమార్ స్వస్థలం. తమ ఊరిలో, చిన్న పట్టణంలో అతని జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అయితే, తాను కోరుకున్నట్టు బతకాలంటే అమలాపురం సరిపోదని హైదరాబాద్ వస్తాడు. జీవితంలో ఏదైనా సాధించాలనే కోరికతో సిటీకి వస్తాడు. ఇంటర్న్‌షిఫ్ ఉద్యోగిగా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అయితే అక్కడ ఇంగ్లీష్ భాషలో చేసే సంభాషణలు, ఆఫీసులోని రాజకీయాలు, కొంత మంది బెదిరింపులకు పాల్పడటం, ఓ పద్ధతి లేకుండా ప్రపవర్తించటం... ఇవన్నీ అరుణ్ కుమార్ ఎదుర్కొంటాడు. తోటి ఉద్యోగులే అతడిని చులకన చేస్తారు. అటువంటి ఒకానొక సందర్భంలో 'నా విలువ ఏంటి?' అని అరుణ్ కుమార్ తనను తాను ప్రశ్నించుకుంటాడు. ఆ తర్వాత తన చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన రావటమే కాకుండా తన లాంటి వ్యక్తికి అక్కడ విలువలేదని గ్రహిస్తాడు. అయితే, తను చేయాల్సిన లక్ష్యాన్ని గుర్తు చేసుకుని తనలోని నిరాశను దూరం పెడతాడు. పట్టుదలతో తను సాధించాల్సిన విజయంపై మనసు లగ్నం పెడతాడు. అంతిమంగా ఎలా విజయం సాధించాడు? అనేది వెబ్ సిరీస్ కథాంశం.
Also Read : 'టక్కర్' రివ్యూ : మాస్ యాక్షన్ హీరో కావాలని సిద్ధార్థ్ ట్రై చేస్తే?
''కార్పొరేట్ ఉద్యోగుల జీవితాలు, వారి ప్రయాణంలో ఎదురయ్యే సాధక బాధకాలు, కలలను సాకారం చేసుకునే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, సాధించే విజయాలు వంటి వాటిని ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు'' అని 'ఆహా' వర్గాలు తెలిపారు.