గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. విజయ దశమి సందర్భంగా సినిమా విడుదల కానుంది. ఈ రోజు బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేశారు. 


ఎన్‌బికె... నెలకొండ భగవంత్ కేసరి
ఎన్‌బికె... నందమూరి బాలకృష్ణ... ఇదీ నటసింహం పేరు. సినిమాలో కూడా ఆయన పేరు ఎన్‌బికె. అంటే... నెలకొండ భగవంత్ కేసరి. టీజర్ చూస్తే ఎన్‌బికె ఊచకోత ఎలా ఉంటుందో ఈజీగా అర్థం అవుతుంది. బియాండ్ యువర్ ఇమాజినేషన్... ప్రేక్షకుల ఊహలకు అందని రీతిలో 'భగవంత్ కేసరి' సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా అనిల్ రావిపూడి చెప్పేశారు.


'రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు' అని బాలకృష్ణ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. ఆ తర్వాత బాలకృష్ణ మార్క్ ఫైట్, గ్రాండ్ సింగ్ విజువల్స్ కూడా చూపించారు. అడవి బిడ్డగా బాలకృష్ణ కనిపించనున్నారు. 'ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటాది' అని చివర్లో వచ్చే డైలాగ్, ఆ తర్వాత బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్లడం హైలైట్!


విలన్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal)ను సైతం టీజర్‌లో చూపించారు. స్టార్టింగ్ విజువల్స్ చూస్తే... ఆయన ఓ స్టిక్ సాయంతో నడుస్తూ కనిపించారు. ఆ మంది మార్బలం చూస్తే సంపన్నుడు అని అర్థం అవుతోంది. తమన్ నేపథ్య సంగీతం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. హీరోయిన్ కాజల్ & లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీలను చూపించలేదు. ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు. బాలకృష్ణ మాస్ మేనరిజమ్స్ తో అనిల్ రావిపూడి సినిమా తీసినట్టు ఉన్నారు. 


Also Read 'టక్కర్' రివ్యూ : మాస్ యాక్షన్ హీరో కావాలని సిద్ధార్థ్ ట్రై చేస్తే?  



'భగవంత్ కేసరి'లో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వాళ్ళిద్దరి కలయికలో తొలి సినిమా ఇది. ఇంతకు ముందు కొన్నిసార్లు ఈ కాంబినేషన్ కొంత మంది దర్శక, నిర్మాతలు పరిశీలనలోకి వచ్చినా సరే... సెట్ కాలేదు. ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీ లీల ఉన్నారు. బాలకృష్ణకు వరుసకు కుమార్తె అయ్యే పాత్రలో ఆమె నటిస్తున్నారు. బాలకృష్ణ సోదరుడిగా శరత్ కుమార్ నటిస్తున్నారు. శ్రీ లీలకు తండ్రి పాత్ర ఆయనది. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు.  


Also Read విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?



రూ. 36 కోట్లకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie) సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఆరు నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకుందట.